బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ తన భార్య మలైకా అరోరా గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక కొడుకు ఉండడంతో తన కోసం ఇద్దరూ అప్పుడప్పుడు కలుస్తుంటారు. అయితే ఇంతకాలం విదాకులపై స్పందించని అర్భాజ్ మొదటిసారి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా ఓ షోలో పాల్గొన్న అర్భాజ్.. ''మలైకాతో 21 ఏళ్లు సర్దుకుపోయి కాపురం చేశాను. ఏ భర్త కూడా ఇంతలా సర్దుకు పోయేందుకు ప్రయత్నించి ఉండడు. అన్నేళ్లు సర్దుకుపోయినా.. ఆమె పెద్దగా సపోర్ట్ చేయలేదు. భార్యభర్తల బంధం ఇద్దరివైపు నుండి ఉన్నప్పుడు మాత్రమే అది బలంగా ఉంటుంది.

ఒకరు మాత్రమే దాన్ని కొనసాగించాలనుకుంటే సాధ్యం కాదు'' అంటూ వెల్లడించాడు. దీన్ని బట్టి మలైకా కారణంగానే విడాకులు తీసుకున్నారనే విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితాలతో బిజీగా గడుపుతున్నారు.

మలైకా.. అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉందని, త్వరలోనే అతడిని పెళ్లి చేసుకున్నా.. ఆశ్చర్యపోవక్కర్లేదని బాలీవుడ్ మీడియా వార్తలను ప్రచురిస్తోంది. ఇక అర్భాజ్.. మోడల్ జార్జియాతో సహజీవనం సాగిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి.. 

నువ్వు కుర్రాడితో తిరిగితే..నేను కుర్రపిల్లను లైన్లో పెట్టా

విడాకులు తీసుకున్న నటితో కుర్రహీరో పెళ్లి..?

విడాకుల హీరోయిన్ ప్రేమలో యంగ్ హీరో..?