ఇండియాలో పోర్న్ వెబ్ సైట్లను నిషేధించాలనే ప్రతిపాదన చాలా కాలంగా నడుస్తోంది. పోర్న్ చూడడం వలనే అత్యాచారాలు, లైంగిక వేధింపులు 
ఎక్కువవుతున్నాయి ఆ కారణంగానే వాటిని బ్యాన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా భారత్ లో 827 పోర్న్ సైట్లను బ్యాన్ చేయాలని భార‌త టెలికాం శాఖ ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను ఆదేశించింది.

తాజాగా ఈ విషయంపై స్పందించిన నటి మహికా శర్మ.. పోర్న్ బ్యాన్ చేస్తే ఎలా అని ప్రశ్నిస్తోంది. ''పోర్న్ బ్యాన్ చేయడం వలన దేశంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులు తగ్గవు.. మరింత పెరిగే అవకాశం ఉంది. పోర్న్ బ్యాన్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిల అసభ్యకర వీడియోను షూట్ చేయడం, వంటిని వైరల్ చేయడం వంటి కల్చర్ పెరిగిపోతుంది.

పోర్న్ బ్యాన్ చేయడం సమస్యకి పరిష్కారం కాదు.. దీనివలన కొంతమంది తమ కామ వాంఛ తీర్చుకోవడానికి ఏమైనా చేస్తారు. పోర్న్ సైట్లను బ్యాన్ చేయడం  కంటే సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడుకునేలా ప్రభుత్వం ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. సెక్స్ చెడ్డది కాదు.

వీటిని బ్యాన్ చేస్తే నా ఫ్రెండ్ డానీ డి(బ్రిటీష్ పోర్న్ స్టార్) వీడియోలను ఇకపై నేను చూడలేను. తను పోర్న్ ఇండస్ట్రీలో కష్టపడి పని చేస్తున్నాడు'' అంటూ చెప్పుకొచ్చింది.