Asianet News TeluguAsianet News Telugu

'సర్కార్ వారి పాట' కీ మొదలైంది కరోనా పోటు

చెవి పోగుతో పాటు మెడపై రూపాయి సింబల్ టాటూతో మహేశ్ న్యూలుక్‌తో ఆకట్టుకున్నారు. మైత్రీమూవీమేకర్స్- జీఎమ్బీ ఎంటర్ టైన్ మెంట్స్- 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

Mahesh cancel USA schedule of Sarkaru Vaari Paata
Author
Hyderabad, First Published Jun 2, 2020, 10:47 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


 సినీ రంగానికి పెద్ద సమస్యలా రోజు రోజుకీ కరోనా మారుతోంది. ఎటు అడుగు వేయాలన్నా అటే ఇబ్బంది పెడుతోంది. ఓ ప్రక్కన షూటింగ్ లు ఎలా చేయాలా అని తలపట్టుకుంటూంటే..థియోటర్స్ సమస్య మరో ప్రక్క పీడిస్తోంది. ఎలాగో ధైర్యం చేసి కొత్త సినిమాలు మొదలెడుతూంటే లొకేషన్స్ సమస్యగా మారుతున్నాయి. ఇప్పుడు మహేష్ బాబు తాజా చిత్రానికి సైతం అదే సమస్య ఎదురైందని సమాచారం. స్క్రిప్టు చేసినప్పుడు రాసుకున్న లొకేషన్స్ మొత్తం మార్చి ఇప్పుడు తిరిగి పైనల్ వెర్షన్ పరుశరామ్ రాస్తున్నట్లు వినికిడి. 

వివరాల్లోకి వెళితే..సూపర్ స్టార్ మహేష్ బాబు, తొలి సారి పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  విజయ్ దేవరకొండ హీరోగా ' గీతా గోవిందం' చిత్రం తీసి మంచి విజయాన్ని అందుకున్న పరుశరామ్ ఈ సారి ఓ సరికొత్త సబ్జెక్టు తో మహేష్ ని మెప్పించారు.  ఈ చిత్రానికి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ ఫస్ట్ లుక్ వదిలారు.మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో దాదాపు నలభై శాతం వరకూ అమెరికాలో జరిగే సీన్స్ ఉన్నాయని వినికిడి. ఫస్ట్ డ్రాఫ్ట్ రాసుకున్నప్పుడు అలా లాక్ చేసుకున్నారు.

 అప్పుడికి ఇంత కరోనా ఉధృతి లేదు. అమెరికాలో పరిస్దితిలు యధాస్దితికి వస్తాయి అని లెక్కేసారు. అయితే ఇప్పటికీ రోజు వారీ వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. దాంతో రాబోయే ఆరు నెలలు దాకా అక్కడ షూటింగ్ లు కష్టమనే అభిప్రాయానికి దర్శక,నిర్మాతలు వచ్చారు. దాంతో మహేష్ బాబు సూచనలు మేరకు అమెరికా ఎపిసోడ్ మొత్తం షిప్ట్ చేసి ఇండియాకు మార్చేసినట్లు సమాచారం. ఇండియాలోనే మొత్తం కథ జరుగుతుందంటున్నారు. అయితే అమెరికా తీసేసి,మరి ఎక్కడకి లొకేషన్ మార్చారో తెలియాల్సి ఉంది.

ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కరోనా మన దేశంలో కంట్రోలులోకి వచ్చాక మొదలు కానుంది. అలాగే ఈ సినిమా బ్యాంకింగ్ రంగలోని ప్రాడ్స్ పై ఉండబోతోందని వినపడుతోంది.  ఇక ఈ చిత్రం కథలో విలన్ ..ఇక్కడ కోట్ల రూపాయల బ్యాంక్ ప్రాడ్ చేసి అమెరికా వెళ్లి సెటిల్ అవుతాడు. అతన్ని ఇండియాకు తీసుకువస్తాడు హీరో అని తెలుస్తోంది. చిత్రం గురించి మహేష్ మాట్లాడుతూ..తన కొత్త చిత్ర కథా నేపథ్యం  చక్కటి వినోదంతో పాటు బలమైన సందేశమున్న చిత్రమని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు కుదుటపడి.. సినిమా సెట్స్‌పైకి వెళ్లాకే విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
 
  “14 రీల్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్” కలిసి ఈ సినిమా ని నిర్మించనున్నారు.సంగీతం  తమన్ అందించబోతున్నాడట.  అలాగే చాలా కాలం తర్వాత మహేష్ రొమాంటిక్ బాయ్ గా నటించబోతున్నాడు. మహేష్ ను ఒక మ్యాచుర్డ్ లవ్ స్టోరీలో చూపించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో ఉపేంద్ర విలన్ గా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు రానుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios