బిగిల్ చిత్రం గురించి టాలీవుడ్ లో కూడా చర్చ జరుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. అట్లీ విజయ్ కాంబినేషన్ లో వరుసగా రెండు చిత్రాలు వచ్చాయి. తేరి, మెర్సల్ రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. దీనితో తన తదుపరి చిత్రాన్ని తెలుగు హీరోలతో చేద్దామని గత ఏడాది అట్లీ హైదరాబాద్ కు కూడా వచ్చాయి. 

ఆ సమయంలో అట్లీ గురించి పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. అట్లీ తెలుగు హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. అట్లీ మొదట బిగిల్ కథని సూపర్ స్టార్ మహేష్ బాబుకు వినిపించాడట. ఈ చిత్రంలో హీరో ద్విపాత్రాభినయంలో కనిపించాలి. ఓ పాత్రలో ఓల్డ్ లుక్ లో కనిపించాలి. దీనితో మహేష్ బిగిల్ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

ఆ తర్వాత అల్లు అర్జున్ సంప్రదించగా అతడు కూడా నో చెప్పాడు. దీనితో అట్లీ మరోమారు విజయ్ నే లైన్ లో పెట్టాడు. అలా విజయ్, అట్లీ హ్యాట్రిక్ కాంబినేషన్ సెట్ అయింది. 

ఇటీవల బిగిల్ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం అనే అంచనాలు మొదలయ్యాయి. ఇంతటి అద్భుతమైన కథని బన్నీ, మహేష్ ఎలా వదులుకున్నారో మరి. ఆసక్తి రేపుతున్న బిగిల్ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.