Asianet News TeluguAsianet News Telugu

నగ్నంగా నటించి కుర్రాళ్లను కవ్విస్తున్న ఇలియానా

  • అజయ్ దేవ్ గన్ హీరోగా తెరకెక్కుతున్న బాద్షాహో చిత్రంలో  ఇలియానా
  • బాద్షాహోలో నగ్నంగా నటించి మళ్లీ కుర్రాళ్లను కవ్విస్తున్న ఇలియానా
  • టీజర్ లోనే ఇలియానా ఒంటిపై నూలుపోగు లేకుండా విప్పే సీన్
lieana nude clip in ajaydevagan baadshaho teaser creating attention

గత కొంత కాలంగా ఇలియానా పరిస్థితి దయనీయంగా ఉంది. తెలుగులో టాప్ గేర్ లో దూసుకెళ్తున్న సమయంలో బాలీవుడ్ డ్రీమ్స్ ఎక్కువై అక్కడికి వెళ్లిన ఇలియానా బాలీవుడ్ కెరీర్ ఆశాజనకంగా లేకపోవడంతో ఇక చేసేది లేక ఫోటో షూట్ లతో వార్తల్లో నిలిచేందుకు తెగ ప్రయత్నించింది. అటు బాలీవుడ్ లోనే కాక ఇక్కడా అవకాశాల్లేక ఏడాది పైగా ఖాళీగా ఉండిపోయింది. కానీ ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ ఇల్లీ బేబీనే. గతేడాది ‘రుస్తుమ్’ సినిమాతో మాంచి హిట్టును ఖాతాలో వేసుకున్న ఈ గోవా బ్యూటీ.. ఆ ఊపులో ఒకటికి రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు పట్టేసింది. ఆ సినిమాలే.. ముబారకన్, బాద్షాహో. ఈ రెండు సినిమాల టీజర్.. ట్రైలర్ ఒకే రోజు విడుదలై ఇలియానా పేరు మార్మోగిపోయేలా చేస్తున్నాయి.



ఇక ‘బాద్షాహో’ టీజర్ ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎమర్జన్సీ రోజుల్లో ప్రభుత్వ ఖజానాతో ప్రయాణిస్తున్న ఓ వాహనం మీద ఆరుగురు దాడి చేసి ఆ సొమ్మును కొల్లగొట్టేందుకు చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఐతే ట్రైలర్లో కంటెంట్ కంటే కూడా ఇలియానా న్యూడ్ బ్యాక్ పోజులు, అజయ్ దేవగన్తో రొమాన్సే బాగా హైలైట్ అయ్యాయి. దీంతో ఇల్లీ బేబీ రొమాన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంతా వెయిట్ చేస్తున్నారు.

 

మరోవైపు ‘ముబారకన్’ సినిమా ట్రైలర్లోనూ ఇలియానా చాలా సెక్సీగా కనిపించింది. ఇది శంకర్ మూవీ ‘జీన్స్’ స్ఫూర్తితో తెరకెక్కిన సినిమాలా కనిపిస్తోంది. ఇలియానా గ్లామర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అయ్యేలా ఉంది. ఈ సినిమాలో ఆథియా శెట్టి మరో కథానాయికగా కనటిస్తుండగా.. ట్రైలర్లో ఆమెను పూర్తిగా డామినేట్ చేసింది ఇలియానా. మొత్తానికి ఒకే రోజు ఒక టీజర్.. ట్రైలర్లో హైలైట్ అయిన ఇలియానా తాజాగా మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయింది. ‘ముబారకన్’ జులై 28న.. ‘బాద్షాహో’ సెప్టెంబరు 1న విడుదల కాబోతున్నాయి. ఇక మళ్లీ ఇలియానా హవా నడుస్తోందా చూడాలి.

 

Follow Us:
Download App:
  • android
  • ios