ప్రముఖ దర్సకుడు క్రిష్ తన ఇన్స్టాలో చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. క్రిష్‌ తాజాగా తన ఇన్స్టాలో రైటర్‌ సాయిమాధవ్‌ బుర్రా రాసిన అంతర్వాహిని అనే కవితను పోస్ట్‌ చేశారు. ఈ కవితలో ఏముందనే విషయం కన్నా ..ఈ కవితకు పెట్టిన హెడ్డిగ్ నే ...పవన్ సినిమాకు టైటిల్ గా పెట్టబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. క్రిష్, పవన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ ...అంతర్వాహిని అంటూ కొందరు ఉత్సాహవంతులు ఫొటో షాప్ లో పోస్టర్స్ కూడా రెడీ చేసేస్తున్నారు. అయితే పవన్ సినిమాకు అంతర్వాహిని అనే టైటిల్ ఎందుకు పెడతారు...అది క్రిష్ కు నచ్చిన ఓ కవిత ..దాన్ని ఆయన ఇన్స్టా లో షేర్ చేసుకున్నారు అంతే..అంతకు మించి ఏమీ లేదు అని క్రిష్ టీమ్ లో వ్యక్తులు క్లారిటీ ఇస్తున్నట్లు సమాచారం.  

ఇక ప‌వ‌ర్ స్టార్ త‌న 27వ సినిమాగా క్రిష్ ద‌ర్శక‌త్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ  మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై, కొద్దిరోజులు జరుపుకోగా క‌రోనా వ‌ల‌న షూట్ కు బ్రేక్ పడింది. త్వరలో మళ్లీ షూటింగ్ ను తిరిగి ప్రారంభించబోతున్నారు. రీసెంట్ గా ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప‌వ‌న్ ప్రీ లుక్ విడుద‌ల చేశారు ద‌ర్శకుడు క్రిష్‌. ‘వకీల్‌సాబ్‌’ షూటింగ్‌ పూర్తి కాగానే పవన్‌, క్రిష్‌ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్‌ అవుతుంది.

  ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

ఏదైమైనా... ఇక ఇప్పటివరకూ విరూపాక్ష, బందిపోటు, గజదొంగ, ఓం శివమ్‌ టైటిల్స్ వినపడగా ఇప్పుడు ఈ లిస్టులో అంతర్వాహిని అనే టైటిల్‌ కూడా చేరిపోయింది. మరి క్రిష్ ఈ టైటిల్ పై క్లారిటీ ఇచ్చేలోపు ఇంకెన్ని టైటిల్స్ వస్తాయో చూడాలి.