Rohit Sharma in pain : టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియ‌న్స్ స్టార్ ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ ఏడ్చేశాడు. కీల‌క‌మైన మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై ముంబై ఇండియ‌న్స్ గెలిచిన‌ప్ప‌టికీ హిట్ మ్యాన్ బాధ‌ప‌డుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.  

Rohit Sharma in poor form : ఐపీఎల్ 2024కు ముందు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తొలగించబడ్డాడు. ప్లేయ‌ర్ గా ఆడుతున్నాడు. అయితే, హిట్ మ్యాన్ టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు. భారత కెప్టెన్ గా మరో ఐసిసి టోర్నమెంట్ లో దేశాన్ని ముందుకు నడిపించ‌నున్నాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 లో రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఫేవరెట్‌గా బ‌రిలోకి దిగుతోంది. అయితే, టీ20 ప్రపంచకప్ వ‌చ్చే నెల‌లో ప్రారంభం కానున్న స‌మ‌యంలో రోహిత్ శర్మ ఫామ్‌పై ఆందోళనలు పెరుగుతున్నాయి. భారీ ఇన్నింగ్స్ తు రోహిత్ బ్యాట్ నుంచి రావ‌డం లేదు. ఐపీఎల్ 2024లో సోమవారం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో కేవలం ఐదు బంతుల్లో నాలుగు పరుగులకే ఔటయ్యాడు.

దీంతో టీ20 ప్రపంచ కప్ 2024లో రోహిత్ శర్మ ఎంపికపై అభిమానులు, క్రికెట్ విశ్లేష‌కులు తమ ఆందోళనలను లేవనెత్తారు. ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్ ల‌లో బాగా రాణించిన రోహిత్ శ‌ర్మ ఆ త‌ర్వాత ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బంది ప‌డుతున్నాడు. వ‌రుస‌గా సింగిల్ డిజిట్ కే ప‌రిమితం అవుతున్న‌డ‌నే విమ‌ర్శ‌లు, ఆందోళ‌న మ‌ధ్య రోహిత్ శ‌ర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో బాధ‌తో ఏడుస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. రోహిత్ శర్మ ఫామ్ గురించి హర్షా భోగ్లే స్పందిస్తూ.. రోహిత్ శర్మ తన ఫామ్‌పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ 2024లో భారత కెప్టెన్ తన చివరి ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు.. ఇది టీ20 ప్రపంచ కప్‌కు ముందు భారీ ఆందోళన క‌లిగించే విష‌యంగా పేర్కొన్నారు.

టీ20 ప్రపంచకప్‌పై దాడిచేస్తాం.. పాకిస్థాన్ ఉగ్రవాదుల బెదిరింపులు

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

హెలికాప్టర్ తో టీ20 ప్రపంచ కప్ భార‌త‌ జెర్సీ ఆవిష్క‌ర‌ణ‌.. అభిమానులు ఎక్కడ కొనుక్కోవచ్చు?