బాలీవుడ్ సినిమావాళ్ళకు ఓపికెక్కువ అని ఓ టాక్ ఉంది. ఎందుకంటే ఓ సినిమా మొదలైంది అంటే ఎంత ఆలస్యమైనా సినిమా పర్ఫెక్ట్ గా అనిపించే వరకు బయటకు వదలరు. ఇక అక్కడ ఉన్న ఒక బ్యాడ్ టాక్ ఏమిటంటే సినీ తారలు ఎక్కువగా దర్శకులకు చిరాకు తెప్పిస్తుంటారు. ప్రతిసారి స్క్రిప్ట్ లో జోక్యం చేసుకుంటారు. 

కొందరికైతే ఆ డోస్ కొంచెం ఎక్కువగానే ఉంది. అందులో వివాదాల క్వీన్ కంగనా రనౌత్ అయితే ఏకంగా డైరెక్టర్ నుంచి మైక్ లాగేసుకొని యాక్షన్ అని చెప్పేస్తుందట. అనేకసార్లు ఇది నీరూపితమవ్వగా ఇటీవల మణికర్ణిక విషయంలో అయితే గట్టిగా వేలుపెట్టేసింది. చిర్రెత్తుకొచ్చి దర్శకుడు క్రిష్ బయటకు వచ్చేశాడు. దీంతో అమ్మడు టైటిల్ కార్డ్స్ లో పేరు కూడా వేసుకుంది. 

దాదాపు 70శాతం సినిమా తానే డైరెక్ట్ చేశానని ఇటీవల తెలుగు ప్రమోషన్స్ లో వివరణ ఇచ్చింది. భవిష్యత్తులో కూడా తాను ఇలానే చేస్తాను అన్నట్లు క్వీన్ హీరోయిన్ మాట్లాడింది. నెక్స్ట్ చేయబోయే సినిమా కోసం ముందుగానే దర్శకుడికి ఈ విషయం చెప్పిందట. అయితే కంగనా వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. పక్కోడి కష్టంలో ఇలా వెలుపడితే ఎలా మేడమ్ అనే కామెంట్స్ వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు 

మణికర్ణిక తెలుగు ట్రైలర్

మణికర్ణిక ట్రైలర్ టాక్: ఉగ్రరూపంలో వీరనారి!

మూసుకోండంటూ క్రిటిక్స్ కు ఘాటుగా వార్నింగ్ 

క్రిష్ వింటున్నావా.. కంగనా కండీషన్స్?

'మణికర్ణిక' డెబ్బై శాతం నేనే డైరెక్ట్ చేశా: కంగనా!