బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో మణికర్ణిక ఒకటి. టాలీవుడ్ దర్శకుడుక్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ లో కొన్ని కీలక సన్నివేశాలను కథానాయిక కంగనా తెరకెక్కించింది. మొత్తానికి సినిమా షూటింగ్ ను ఫినిష్ చేసిన చిత్ర యూనిట్ జనవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

ఇక ఇప్పుడు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కంగనా ఝాన్సీ లక్ష్మి బాయ్ పాత్రలో ఉగ్రరూపం దాల్చింది. ఒక అందమైన అమ్మాయిలా సుకుమారంగా కనిపిస్తూనే ఆవేశంతో కూడిన వీరనారి ఆనవాళ్లను కరెక్ట్ గా ప్రజెంట్ చేసినట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు అంచనాలకు మించి ఉన్నట్లు తెలుస్తోంది. 

చూస్తుంటే ట్రైలర్ తోనే ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసేలా ఉన్నారనిపిస్తోంది. బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథను రచించారు. ఇక దర్శకుడు క్రిష్ షూటింగ్ చివరిదశలో కంగనాతో విభేదాలవల్ల తప్పుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి క్రిష్ నేమ్ వేశారు. అలాగే కంగనా పేరు కూడా కనిపిస్తోంది. ఫైనల్ గా సినిమా రిలీజ్ట్ ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే జనవరి ఎండింగ్ వరకు ఆగాల్సిందే.