'కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'మణికర్ణిక' సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఇప్పుడు డెబ్బై శాతం డైరెక్షన్ తనదేనని స్టేట్మెంట్ ఇస్తోంది కంగనా.

మొదట డైరెక్షన్ క్రెడిట్ అంతా క్రిష్ కే చెందుతుందని, కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉందని చెప్పింది కంగనా.. ఆ తరువాత రీషూట్ల గురించి, కథలో కొన్ని కీలక సన్నివేశాలను డైరెక్ట్ చేయడం గురించి మాట్లాడింది. ఇప్పుడు ఏకంగా డెబ్బై శాతం డైరెక్షన్ తనదేనంటోంది.

ట్రైలర్ విడుదలైన సందర్భంగా కంగనా ఈ విధమైన కామెంట్స్ చేసింది. ఇంతకముందు ఆమె చెప్పిన మాటలకు ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఏమాత్రం పొంతన లేదు. అసలు డైరెక్టర్ గా క్రెడిటే అక్కర్లేదని చెప్పిన కంగనా ఇప్పుడు క్రిష్ పరువు తీసే విధంగా ఎందుకు కామెంట్స్ చేస్తుందో..? డైరెక్టర్ గా ఎవరి పేరు పడితే ఏంటి.. కంగనా ఇలాంటి కామెంట్స్ చేసిన తరువాత. ఇంత జరుగుతున్నా.. క్రిష్ మాత్రం సైలెంట్ గా ఉండడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. 

మణికర్ణిక ట్రైలర్ టాక్: ఉగ్రరూపంలో వీరనారి!