వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా బాలీవుడ్ లో  'మణికర్ణిక' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్వీన్ అఫ్ బాలీవుడ్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రను పోషిస్తున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకుడిగా వ్యవహరించాడు. చాలావరకూ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత మనస్పర్థలు రావడంతో, క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి పక్కకి తప్పుకున్నాడు. దాంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దర్శకత్వ పనులను కంగనా చేపట్టింది. అయితే ఇదంతా జరిగిపోయిన కథ. 

ఇప్పుడీ   'మణికర్ణిక'  చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో మీడియాలో ఈ సినిమాపై రకరకరాల టాక్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా నెగిటివ్ టాక్ ఈ సినిమాని భయంకరంగా చుట్టముడుతోంది. దాంతో కంగనాకు చిర్రెత్తికొస్తోంది. తన డిజైనర్ ఫ్రెండ్ నీతా లుల్లా ముంబైలో హోస్ట్ చేసిన క్రిస్మస్ పార్టీకి తోటి నటి అంకిత లోఖండేతో కలిసి హాజరైన సందర్భంగా ఆమె  మీడియాతో మాట్లాడింది.  'మణికర్ణిక' రిలీజ్ తర్వాత అందరి నోళ్లూ మూతపడటం ఖాయం. అది తప్పకుండా జరుగుతుంది.

నా గురించి, నా సినిమా గురించి చెడుగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ ‘మణికర్ణిక' చూసిన తర్వాత నోరు మూసుకుంటారు.  మంచిగా మాట్లాడిన వారు కంటిన్యూ చేస్తూనే ఉంటారు..వాళ్ల నోళ్లు ఎవరూ మూయలేరు. ఇది తప్పకుండా జరుగుతుంది అనుకుంటున్నాను అని కంగనా వ్యాఖ్యానించటం హాట్ టాపిక్ ఆఫ్ ది టౌన్ గా బాలీవుడ్ లో మాట్లాడింది. రిలీజ్ కు ముందు ఎందరో ఎన్నో అంటారు...అన్ని సీరియస్ గీ తీసుకుంటే ఎలా..రేపు సినిమా రిలీజ్ అయ్యాక నెగిటివ్ రివ్యూలు వస్తే ఏం చెయ్యగలదు అని వ్యాఖ్యానిస్తున్నారు. 

మరో ప్రక్క ఈ సినిమాకు దర్శకత్వం చేయడమనేది తనకు పెద్ద కష్టంగా ఏం అన్పించలేదంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో చర్చగా మారాయి. 'దర్శకత్వం చేయడం నాకేం కొత్తకాదు .. నా 23వ యేటనే ఒక లఘు చిత్రాన్ని రూపొందించాను .. అందుకోసం అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేశాను. 

ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఒక్కసారిగా స్వీకరించడం వలన కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వాటిని నేను అధిరోహించగలిగాను. నా ప్రతి సినిమాకి నేను చాలా కష్టపడతాను… ఈ సినిమాకి అంతకంటే కొంచెం ఎక్కువగా కష్టపడవలసి వచ్చిందంతే. అంతకి మించి నాకు పెద్ద కష్టంగా ఏమీ అనిపించలేదు' అంటూ చెప్పుకొచ్చింది.