బుల్లితెర మీద స్టార్ యాంకర్‌గా ఓ వెలుగు వెలగటమే కాదు. వెండితెర మీద కూడా సత్తా చాటిన అందాల భామ అనసూయ భరద్వాజ్‌. బుల్లితెర మీద హాట్ హాట్ అందాలతో అలరించే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్‌లో  రచ్చ చేస్తుంటుంది. లాక్‌ డౌన్‌ కారణంగా మూడు నెలల పాటు ఇంటికే పరిమితమైన అనసూయ, ఎప్పటికప్పుడు తన డెయిలీ రొటీన్‌ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

ఈ మధ్యే షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావటంతో జోరు పెంచింది. తన జబర్ధస్త్ లుక్‌ను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో హాట్‌ వీడియోను షేర్ చేసింది ఈ బ్యూటీ. పొట్టి బట్టల్లో హాట్ హాట్‌గా యోగా చేస్తూ అభిమానులను అలరించింది. బాబా రామ్‌ దేవ్‌ స్టైల్‌లో పొట్టను కదిలిస్తూ అనసూయ చేసిన ఈ యోగాకు ఓ రేంజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు హాట్ హాట్ కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాదు గతంలో తన బ్యూటీ సీక్రెట్స్‌ను రివీల్‌ చేస్తూ చాలా పోస్ట్‌లు పెట్టింది అనసూయ. రెడ్‌ వైన్‌ తో స్కిన్‌ గ్లో వస్తుందని అందుకే తాను రోజు రెడ్‌ వైన్‌ తాగుతానని చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాదు తన డైట్‌కు సంబంధించిన వంటకాలను స్వయంగా వండి కూడా చూపించింది అనసూయ.