యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న `సాహో` ట్రైలర్ విడుద‌లై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ స‌న్నివేశాల‌తో హాలీవుడ్ స్టైల్లో ఉన్న ఈ ట్రైలర్ ప్రభాస్ అభిమానుల‌నే కాదు తెలుగు సినీ ప్రముఖులను కూడా ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటికే  నాగార్జున‌, రానా, అఖిల్ వంటి టాలీవుడ్ ప్ర‌ముఖులు `సాహో`ను సోషల్ మీడియా ద్వారా ప్రశంసించారు.

అయితే ప్రభాస్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని పొగుడుతూ ట్వీట్ చేసే రాజమౌళి, సాహో ట్రైలర్ రిలీజ్ తరువాత ట్వీట్ చేయకపోవడం వింతగా , విశేషంగా మారింది. అంతేకాదు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయమై అప్ సెట్ గా ఉన్నారు. బాహుబలి తర్వాత వస్తున్న చిత్రం కావటంతో రాజమౌళి ట్వీట్ కోసం దేశం లో ఉన్న సినిమా లవర్స్ ఎదురుచూస్తారు. 

ఈ విషయమై  ప్రభాస్ ని మీడియా వాళ్లు అడగటం జరిగింది. దానికి ప్రభాస్ సమాధానమిస్తూ..రాజమౌళి ఫోన్ చేసి బాగుందని మెచ్చుకున్నారని అన్నారు.  రాజమౌళితో పాటు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందలు తెలిపారని.. చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు ప్రభాస్.  అయితే రాజమౌళి ఎందుకు ట్వీట్ చేయలేదో తెలియలేదు. ఆయన బిజిగా ఉన్నారో , మరేదో కారణమో అసలు తెలియరాలేదు. 

ఇక  ప్రభాస్ కంటిన్యూ చేస్తూ...పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా దక్షిణాది అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేస్తున్నట్లు వెల్లడించారు. భారతదేశపు అతిపెద్ద యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిదని, తెలుగు సినిమా నుంచి రాబోతున్న మరో అద్భుతం అని హాలీవుడ్‌ను పోలి ఉన్న విజువల్స్ అని టీమ్ అంటోంది. గెట్‌ రెడీ ఇండియా అని పిలుపు ఇస్తోంది.