బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి వస్తోన్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం సాహో ఈ నెల 30న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ 20 రోజుల ముందే ప్రమోషన్ డోస్ పెంచేసింది. రీసెంట్ గా ముంబై మీడియాతో మాట్లాడిన ప్రభాస్ - శ్రద్దా కపూర్ ఆదివారం టాలీవుడ్ మీడియా ముందుకు వచ్చారు.

ఈ సందర్బంగా శ్రద్దా కపూర్ మాట్లాడుతూ.. ఇదే నా మొదటి సినిమా కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఇంత పెద్ద సినిమా కావడం వెరీ స్పెషల్ అని చెప్పవచ్చు. అందుకు నిర్మాతలకు దర్శకుడికి చాలా థ్యాంక్స్. ప్రభాస్ తో నటించడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. దాదాపు రెండు రెండేళ్లు సినిమాతో  ట్రావెల్ చేశాను. హైదరాబాద్ నాకు సెకండ్ హోమ్ అయ్యింది. 

ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా.అని శ్రద్దా మాట్లాడింది. అయితే ప్రభాస్ తో రొమాన్స్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ లో నటించగా అందులో ఏ సీన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేశారని యాంకర్ అడగ్గా.. అందుకు శ్రద్దా మాట్లాడుతూ.. ఒక్కటి అని చెప్పలేను. అది చాలా కష్టం. రెండు యాంగిల్స్ లో ఎంజాయ్ చేస్తూ నటించమని ఆమె వివరణ ఇచ్చారు. 

బాహుబలి తరువాత సాహోలో మార్పులు చేశాం : ప్రభాస్ 

చిరంజీవి గారు మెస్సేజ్ చేయగానే షాకయ్యా : ప్రభాస్