టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా రిలీజ్ కావడానికి ఇంకా కొన్ని రోజులే ఉంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు ప్రమోషన్స్ ద్వారా తెలిసిపోతోంది. అయితే రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ప్రభాస్ సినిమా గురించి మాట్లాడుతూ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి కూడా వివరణ ఇచ్చాడు. 

సాహో సినిమా కోసం ఇంత సమయం పడుతుందని అనుకోలేదు. కానీ బాహుబలి సినిమా తరువాత కొన్ని మార్పులు చేసి క్వాలిటీ కోసం బడ్జెట్ కూడా పెంచాల్సి వచ్చింది. కానీ నెక్స్ట్ సినిమాకు మరీ అంత సమయం తీసుకోలేను. వెంటనే రిలీజ్ చేస్తా. ఇక 100కోట్ల సినిమా చాలా ప్రెజర్ తో కూడుకున్నది. నెక్స్ట్ అంత పెద్ద బడ్జెట్ సినిమాలు చేయకుండా ఉండడానికి ట్రై చేస్తానని అన్నారు. 

తదుపరి సినిమా గురించి మాట్లాడుతూ..  నెక్స్ట్ గోపి కృష్ణ బ్యానర్ లోనే ఉంటుంది. ఇప్పటికే 20 రోజుల షూటింగ్ కూడా పూర్తి చేశామని ప్రభాస్ వివరణ ఇచ్చాడు. జిల్ దర్శకుడు కె.,రాధాకృష్ణ ఆ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

బాహుబలి తరువాత సాహోలో మార్పులు చేశాం : ప్రభాస్ 

ప్రభాస్ తో రొమాన్స్ - యాక్షన్.. ఫుల్ ఎంజాయ్ చేశా: శ్రద్దా కపూర్