కన్నడ స్టార్ యష్ నటించిన ‘కేజీఎఫ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత సెన్సేషన్  క్రియేట్ చేసిందో తెలిసిందే. కేవలం కన్నడ భాషలోనే కాకుండా రిలీజైన అన్ని చోట్లా కనక వర్షం కురిపించింది. గోల్డ్ మైన్స్ నేపధ్యంలో ఎదిగిన రాకీ భాయ్ అనే మాఫియా డాన్  కథాంశంతో..తెరకెక్కిన ఈ చిత్రం కేక పెట్టించే స్క్రీన్ ప్లే, అదిరిపోయే డైలాగ్స్‌లో అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో నటుడు యష్ ఫుల్ పాపులర్ అయ్యాడు.

 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంకు.. ఇప్పుడు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్-2’ తెరకెక్కుతోంది. అయితే కరోనా దెబ్బతో ఈ భారి సినిమాని ఎవరు కొంటారు...ఎలా రిలీజ్ చేస్తాం అనే బెంగ నిర్మాతలకు పట్టుకుందిట. అయితే కేజీఎఫ్ క్రేజ్ ముందు కరోనా కొట్టుకుపోయిందని ట్రేడ్ వర్గాల సమాచారం. దాదాపు  అన్ని భాషల్లోనూ రిలీజ్ అవ్వబోయే ఈ సినిమాకు ఈ సయమంలోనూ మంచి ఆఫర్స్ వస్తున్నాయని వినికిడి. 

రిలీజ్ ఎప్పుడైనా మాకే ఇవ్వాలని అడుగుతున్నారట. కొందరు డిస్ట్రిబ్యూటర్స్ అడ్వాన్స్ ఇవ్వటానికి సిద్దపడుతున్నారట. ఇది చూసి నిర్మాతలు షాక్ అయ్యారట. ఇదిలా ఉంటే కేజీఎఫ్-2 విడుదలకు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ భారీ రేటు పెట్టి కొనేసిందట. కాగా ఇప్పటికే కేజీఎఫ్ మొదటి పార్ట్‌ని కూడా అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుక్కొని ప్రసారం చేసింది. తాజాగా కేజీఎఫ్-2 డిజిటల్ రైట్స్ అన్ని భాషలనూ కలిపి రూ.55 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. 

మొత్తానికి కేజీఎఫ్ సృష్టించిన సంచలనంతో ఇప్పుడు కేజీఎఫ్-2 మూవీపై అన్ని భాషల్లోనూ భారీ డిమాండ్ ఏర్పడింది. కరోనా టైమ్ లోనూ ఈ స్దాయిలో ఈ సినిమాకు బిజినెస్ డిమాండ్ ఏర్పడటం మిగతా హీరోలను, నిర్మాతలను ఆలోచనలో పడేస్తోందిట. ఆ సినిమాపై పెట్టబడి పెడితే ఎప్పుడు రిలీజైనా కోట్లు వెనక్కి వస్తాయని భావించటమే అందుకు కారణం అని చెప్తున్నారు.

దీనికి తోడు కేజీఎఫ్-2లో ఫేమస్ యాక్టర్లు నటిస్తున్నారని సమాచారం. తాజాగా ఈ సీక్వెల్‌లో తమన్నా యష్‌కి జోడీగా నటిస్తోందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.  బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ అధిర పాత్రలో నటిస్తున్నారు. అలాగే రమ్యకృష్ణ, రవీనా టాండన్ కూడా సెకండ్ పార్ట్‌లో నటిస్తున్నారని తెలుస్తోంది.