దీపావళి మరి కొద్దిరోజులలో రానుండగా బిగ్ బాస్ హౌస్ కి కొన్ని గిఫ్ట్స్ వచ్చినట్లు హోస్ట్ నాగార్జున తెలియజేశారు. ఐతే ఆ గిఫ్ట్స్ మీకు దక్కాలంటే కొన్ని టాస్క్ లు పూర్తి చేయాలని నాగార్జున ఆదేశించారు. ఇచ్చిన టాస్క్ ఎవరు బాగా చేయగలరో వారిని నామినేట్ చేయాలని ఇంటి సబ్యులకు నాగార్జున చెప్పారు. 

సోహైల్ గిఫ్ట్ కోసం ఇచ్చిన టాస్క్ కి మెహబూబ్ ని సోహైల్ నామినేట్ చేశాడు. మెహబూబ్ ఆ టాస్క్ గెలిచి సోహైల్ గిఫ్ట్ గెలిచేలా చేశాడు. ఆ గిఫ్ట్ కూడా మెహబూబ్ పంపినది కావడం విశేషం. ఇక అఖిల్ కి వచ్చిన గిఫ్ట్ గెలుచుకోవడానికి అభిజిత్ ని నామినేట్ చేయగా అభిజిత్ గెలిచాడు. మోనాల్ పంపిన చాక్లెట్స్ అఖిల్ తీసుకున్నారు. 

ఇక ఈ టాస్క్ లో లాస్యను వచ్చిన గిఫ్ట్ గెలుచుకొనే టాస్క్ కి హారికను ఎంపిక చేయగా ఆమె టాస్క్ ఓడిపోవడంతో లాస్య గిఫ్ట్ అందుకోలేక పోయింది. మోనాల్ కోసం గేమ్ ఆడిన మెహబూబ్ గెలిచి ఆమెకు గిఫ్ట్ వచ్చేలా చేశాడు. అవినాష్ తనకు వచ్చిన గిఫ్ట్ గెలుచుకొనే టాస్క్ రాజశేఖర్ కి ఇవ్వడం జరిగింది. ఓడిపోయిన రాజశేఖర్ అవినాష్ గిఫ్ట్ ఓడిపోయాడు. 

అరియానాకు కు వచ్చిన గిఫ్ట్ గెలుచుకొనే టాస్క్ మెహబూబ్ కి ఇవ్వగా ఓడిపోవడంతో అరియనా గిఫ్ట్ కోల్పోయింది. ఐతే ఈ టాస్క్ లో నాగార్జున ఇద్దరిని డిజపాయింట్ చేసారు. ఇంటిలో ఉన్న అమ్మ రాజశేఖర్ మరియు మోనాల్ అసలు గిఫ్ట్స్ రాలేదని నాగార్జున చెప్పారు. ఇంటి సబ్యులకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని , ఇంటిలో సభ్యులు పంపినవే... అలాంటింది మోనాల్ మరియు అమ్మ రాజశేఖర్ కి ఎవరూ గిఫ్ట్స్ పంపలేదు.