హాట్‌ యాంకర్‌ అనసూయ.. టెలివిజన్‌లో చాలా పాపులర్‌. ఆమె క్రేజ్‌ మామూలుగా ఉండదని చెప్పొచ్చు. ఆమె నిత్యం సోషల్‌ మీడియాలో అభిమానులతో చాట్‌ చేస్తుంది నెటిజన్ల కామెంట్లకి బలవుతుంటుంది. తాజాగా ఈ సెక్సీ బ్యూటీ నటుడు నవదీప్‌తో సోషల్‌ మీడియాలో చాట్‌ చేసింది. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న చాటింగ్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

నవదీప్‌ ఇటీవల ఐదు రోజుల పాటు హిమాలయాలకు ట్రిప్‌ వెళ్లాడు. 14 మంది వెళ్ళారు. హిమాలయాల్లో బైక్‌లపై జర్నీ చేశారు. ఆ విశేషాలన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా లైవ్‌ చాటింగ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసి అనసూయ మధ్యలో దూరింది. తనకి హిమాలయాలంటే ఇష్టమని చెప్పింది. అందుకు నవదీప్‌ స్పందిస్తూ, `మిమ్మల్నీ ఎక్కడికో తీసుకెళ్దామనుకుంటా. కానీ మీరు రారు` అని పంచ్‌ వేశాడు. దీంతో అనసూయ ఒక్క సారిగా షాక్‌కి గురయ్యింది. ఇది లైవా? అంటూ నవదీప్‌ని అడిగింది. ఆ తర్వాత దాన్ని మరో రకంగా కవర్‌ చేసింది. మీరిప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారా? అంటూ తన సంభాషణ కంటిన్యూ చేసింది. దీంతో వీరిద్దరి ఈ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది.

నవదీప్‌ చాట్‌ చూసి అనసూయ భర్త కూడా తాను ఇలా తిరిగేవాడినని, పెళ్ళి చేసుకోవడం వల్ల ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుందన్నాడట. అందుకు అనసూయ కూడా ఆమె భర్తకి కౌంటర్‌ ఇస్తూ `మ్యారేజ్‌ చేసుకుని బాధపడుతున్నావా? ఏంటీ?` అని ప్రశ్నించిందట. దీనికి నవదీప్‌ స్పందిస్తూ `బ్యాచ్‌లర్‌గా ఉండి ఉంటే నాలాగే తిరిగేవాడేమో`అని సెటైర్‌ వేశాడు. 

నవదీప్‌ ట్రిప్‌ విషయాల ఎప్పుడూ తనకు చెబుతుంటారని, అవి ఇన్‌స్పైర్‌ చేస్తుంటాయని అనసూయ చెప్పింది. ప్రస్తుతం ఆమె జీ5లతో ఓ వెబ్‌ ఫిల్‌ చేస్తుందట. అయితే నవదీప్‌ అనసూయ కోసం ఓ స్పెషల్‌ రెడీ చేస్తున్నారట. త్వరలోనే అది ఇస్తానని చెప్పాడు. దీంతో హాట్‌ భామ అనసూయ తెగ సంబరపడింది. దాని కోసం వెయిట్‌ చేస్తానని తెలిపింది. ఈ చాటింగ్‌ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది.