Navdeep
(Search results - 51)CricketJan 17, 2021, 6:35 AM IST
సైనీకి ఏమైంది... రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తాడా? లేదా... క్లారిటీ ఎందుకు ఇవ్వడం లేదు...
ఆస్ట్రేలియా పర్యటనలో ప్రత్యర్థి కంటే ఎక్కువగా గాయాలు భారత జట్టును ఇబ్బంది పెడుతున్నాయి. మొదటి టెస్టులో మహ్మద్ షమీ, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ మధ్యలో నుంచి తప్పుకుంటే...
CricketJan 15, 2021, 1:07 PM IST
ముగిసిన మొదటి రోజు ఆట... భారీ స్కోరు దిశగా ఆసీస్... 5 వికెట్లు తీసిన భారత బౌలర్లు...
దుర్బేధ్యమైన గబ్బా టెస్టులో ఏ మాత్రం అనుభవం లేని భారత బౌలర్లు అద్భుతంగా పోరాడుతున్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది ఆస్ట్రేలియా. యంగ్ బ్యాట్స్‌మెన్ లబుషేన్ సెంచరీతో చెలరేగగా మాథ్యూ వేడ్ 45, స్టీవ్ స్మిత్ 36 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ తలా ఓ వికెట్ తీశారు.
CricketJan 15, 2021, 9:15 AM IST
మరో వికెట్ డౌన్... నవ్‌దీప్ సైనీకి గాయం... ఓవర్ మధ్యలోనే పెవిలియన్‌కి...
ఇప్పటికే ఆరుగురు భారత క్రికెటర్లు గాయాలతో టెస్టు సిరీస్ మధ్యలోనే తప్పుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, బుమ్రా, ఉమేశ్ యాదవ్, షమీ వంటి సీనియర్లు లేకుండానే గబ్బా టెస్టులో బరిలో దిగింది భారత జట్టు.
CricketJan 10, 2021, 7:15 AM IST
భారీ ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా... స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ... సైనీకి రెండు వికెట్లు...
మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా పట్టు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేసిన తప్పుల కారణంగా లభించిన ఆధిక్యాన్ని, రెండో ఇన్నింగ్స్‌లో అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో దక్కిన 94 పరుగుల ఆధిక్యంతో కలిపి 276 పరుగుల భారీ లీడ్ సాధించింది ఆస్ట్రేలియా.
CricketJan 7, 2021, 11:58 AM IST
రహానే మార్కు కెప్టెన్సీ: నటరాజన్ బదులు సైనీకి అవకాశం.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాను కోహ్లీ లేని వేళ గెలుపుబాట పట్టించి ఔరా అనిపించాడు.
CricketJan 7, 2021, 8:35 AM IST
ఇండియాతో మూడో టెస్టు: నాలుగేళ్లలో డేవిడ్ వార్నర్ తొలిసారి
ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. స్వదేశంలో వార్నర్ ఇలా అవుట్ కావడం గత నాలుగేళ్లలో ఇదే తొలిసారి.
CricketJan 7, 2021, 8:18 AM IST
ఇండియాతో మూడో టెస్టు: అదిలో ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ
ఇండియాపై జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్ లో 6 పరుగుల స్కోరు వద్ద డేవిడ్ వార్నర్ అవుటై పెవిలియన్ చేరుకున్నాడు.
CricketJan 6, 2021, 12:46 PM IST
మూడో టెస్టుకి భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ... నవ్‌దీప్ సైనీ ఆరంగ్రేటం...
ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకి భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మ జట్టులో చోటు సంపాదించుకోగా, గత మ్యాచ్‌లో గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో నవ్‌దీప్ సైనీ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
CricketJan 4, 2021, 10:39 AM IST
పార్టీ చేసుకున్న ఆ ఐదుగురికి కరోనా నెగిటివ్... టీమిండియాతో కలిసి ఒకే ఫ్లైట్‌లో...
న్యూ ఇయర్ పార్టీ పేరుతో రెస్టారెంట్లో డిన్నర్ చేసిన ఐదుగురు క్రికెటర్లకి కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, పృథ్వీషా, శుబ్‌మన్ గిల్, నవ్‌దీప్ సైనీ డిన్నర్‌కి వెళ్లారు. ఈ క్రికెటర్ల బిల్ చెల్లించిన ఓ అభిమాని, ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడం పెద్ద దుమారం రేగింది.
CricketJan 3, 2021, 11:56 AM IST
శర్మగారి అబ్బాయి ‘బీఫ్’ తిన్నాడా? న్యూఇయర్ పార్టీ ‘బిల్లు’తో రోహిత్ శర్మకు కొత్త చిక్కులు...
రోహిత్ శర్మ, మరో నలుగురు యువ క్రికెటర్లతో చేసిన న్యూ ఇయర్ విందు మనోడికి కొత్త కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. న్యూఇయర్ పార్టీ సందర్భంగా రోహిత్ శర్మ, పృథ్వీషా, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, నవ్‌దీప్ సైనీ కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లి డిన్నర్ చేశారు. అదే రెస్టారెంట్లో భారత క్రికెటర్లను చూసి, ఓ టీమిండియా అభిమాని... అభిమానంతో వారి హోటల్ బిల్లు చెల్లించాడు. బిల్లు కట్టినోడు, కట్టినట్టు ఉండక... సోషల్ మీడియాలో బిల్లుతో సహా పోస్టు చేశాడు. ఇది టీమిండియాకు కొత్త కొత్త సమస్యలు తెస్తూనే ఉంది.
CricketJan 3, 2021, 10:47 AM IST
రోహిత్ ఏందయ్యా ఇది..ఐసోలేషన్‌లో రోహిత్, పంత్ అండ్ కో... మూడో టెస్టు ముందు హైడ్రామా...
భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, వస్తూ వస్తూ కొత్త సమస్యలను కూడా తెచ్చిపెట్టేశాడు. న్యూఇయర్ పార్టీ పేరుతో రోహిత్ శర్మతో కలిసి మరో నలుగురు యువ క్రికెటర్లు ఓ రెస్టారెంట్‌కి వెళ్లి డిన్నర్ చేశారట. కరోనా బయో సెక్యూలర్ జోన్‌కి విరుద్ధంగా జరిగిన ఈ చర్య, భారత జట్టుకి కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. రోహిత్ శర్మతో పాటు మరో నలుగురు క్రికెటర్లను ఐసోలేషన్‌కి తరలించారు...
CricketJan 2, 2021, 12:55 PM IST
అభిమాని ఊహించని సర్ ప్రైజ్.. పెదవి విరిచిన రోహిత్ శర్మ
హోటల్ లో ఈ క్రికెటర్లంతా భోజనం చేయగా.. దాని బిల్లును ఇండియన్ అ భిమాని నవల్ దీప్ సింగ్ చెల్లించాడట. దీంతో.. రోహిత్ సహా ఇతర క్రికెటర్లంతా షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
CricketDec 13, 2020, 4:17 PM IST
INDvAUSA: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ సెంచరీల మోత... రెండో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా డ్రా...
పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో గెలిచి, విజయానందంతో టెస్టు సిరీస్ ప్రారంభించాలని భావించిన టీమిండియాకు షాక్ ఇచ్చాడు ఆసీస్ ఏ జట్టు ప్లేయర్లు బెన్ మెక్‌డెర్మాట్, జాక్ విల్డర్ముర్త్. అద్భుత సెంచరీలతో పోరాడి, భారత జట్టుకి విజయం దక్కకుండా చేశారు.
EntertainmentDec 7, 2020, 8:05 PM IST
విష్ణుప్రియతో డేటింగ్.. నవదీప్ ఏమన్నాడంటే..? పెళ్లిపై కూడా క్లారిటీ!
టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ సినిమాలు లేక టీవీ షోస్ చేస్తూ రాణిస్తున్నాడు. ఆయన యాంకర్ విష్ణుప్రియతో లవ్ ఉన్నట్టు కామెంట్ వినిపిస్తుంది. వీరిద్దరు ఘాటు రొమాన్స్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై నవదీప్ స్పందించాడు.
CricketNov 30, 2020, 2:54 PM IST
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఏంటో అర్థం కావడం లేదు... వాళ్లని ఎందుకు ఆడించలేదు..
ఆసీస్ టూర్‌ను వన్డే సిరీస్‌ను ఓటమితో మొదలెట్టింది భారత జట్టు. బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నా, బౌలర్ల వైఫల్యం భారత జట్టును తెగ వెంటాడుతోంది. అయితే బౌలర్ల కంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా విఫలమయ్యాడనే ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వైఫల్యం భారత జట్టు ఓటమికి కారణమని అంటున్నాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.