Asianet News TeluguAsianet News Telugu

''ప్రభాస్.. భూకబ్జాదారుడు''

శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం వద్ద నటుడు ప్రభాస్ కి చెందిన ఓ గెస్ట్ హౌస్ ని అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

high court response on prabhas land issue
Author
Hyderabad, First Published Jan 3, 2019, 4:21 PM IST

శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం వద్ద నటుడు ప్రభాస్ కి చెందిన ఓ గెస్ట్ హౌస్ ని అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు వాయిదాలు, విచారణల అనంతరం ఈరోజు మరోసారి ఈ భూవివాదం కేసుపై హైకోర్టులో వాదనలు జరిగాయి.

ప్రభాస్ భూకబ్జాదారుడని, ఆయనకి అనుకూలంగా తీర్పిస్తే ఆ భూమిని కబ్జా చేసిన వాళ్ళూ అర్హులవుతారని ప్రభుత్వ లాయర్ వాదించారు. మరోపక్క కొనుగోలు చేసిన భూమిలోనే ప్రభాస్ గెస్ట్ హౌస్ కట్టుకున్నాడని ప్రభాస్ తరఫు లాయర్ కోర్టుకి తెలిపారు.

ఇరు వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది న్యాయస్థానం. రీల్ లైఫ్ లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలికి రియల్ లైఫ్ లో విలన్లతో తలపడి ఉండరని న్యాయస్థానం తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ప్రభాస్ భూకబ్జాదారుడన్న ప్రభుత్వ లాయర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది హైకోర్టు. సామాన్యుడి విషయంలో అయితే అప్పుడే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవాళ్లమన్న హైకోర్టు ప్రభాస్ విషయంలో ఆచితూచి వ్యవహరించామని తెలిపింది.

ప్రభాస్ భూవివాదం కేసు.. అధికారులను నిలదీసిన కోర్టు!

ప్రభాస్ భూ వివాదం: రెవెన్యూశాఖ కౌంటర్ దాఖలు!

ప్రభాస్ పిటిషన్.. విచారణ మళ్లీ వాయిదా!

ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ సీజ్..నేడు హైకోర్టులో విచారణ

కోర్టు తీర్పు దెబ్బ: సినీ హీరో ప్రభాస్ ఇల్లు సీజ్

ఇల్లు సీజ్: హైకోర్టులో హీరో ప్రభాస్ పిటిషన్!

ప్రభాస్ ఇంటి వివాదం.. కోర్టు ఏమంటుందంటే..?

బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు: ప్రభాస్

వాదనలు రేపు వింటాం.. ప్రభాస్ పిటిషన్ పై హైకోర్టు!

 

Follow Us:
Download App:
  • android
  • ios