నిబంధనలనకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ సినీనటుడు ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్త గ్రామంలో తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థలం వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా అధికారులను నియంత్రించాలంటూ ఆయన పిటిషన్‌లో పేర్కోన్నారు.

దీనిపై ఇవాళ ఉమ్మడి హైకోర్టులో విచారణ జరగనుంది. గురువారం పిటిషన్‌ విచారణకు రాకపోవడంతో దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలంటూ జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనాన్ని అభ్యర్థించారు. తన క్లయింట్ కొనుగోలు చేసిన 2083 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం శుక్రవారం విచారణకు అనుమతించింది.

కోర్టు తీర్పు దెబ్బ: సినీ హీరో ప్రభాస్ ఇల్లు సీజ్

ఇల్లు సీజ్: హైకోర్టులో హీరో ప్రభాస్ పిటిషన్!

ప్రభాస్ ఇంటి వివాదం.. కోర్టు ఏమంటుందంటే..?

బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు: ప్రభాస్

వాదనలు రేపు వింటాం.. ప్రభాస్ పిటిషన్ పై హైకోర్టు!