MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కృష్ణంరాజు చేయాల్సిన మూవీ, పట్టుపట్టి చిరంజీవితో చేయించారు.. దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు

కృష్ణంరాజు చేయాల్సిన మూవీ, పట్టుపట్టి చిరంజీవితో చేయించారు.. దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు

చిరంజీవి నటించిన ఓ ఇండస్ట్రీ హిట్ మూవీ గురించి సీనియర్ నటుడు జివి నారాయణ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణం రాజు ప్రారంభించిన సినిమా చివరికి చిరంజీవి చేతుల్లోకి వచ్చింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 28 2026, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి సినిమాలు
Image Credit : Asianet News

చిరంజీవి సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఖైదీ చిత్రంతో మలుపు తిరిగింది. ఆ తర్వాత చిరంజీవి ఇండస్ట్రీ హిట్ల మీద ఇండస్ట్రీ హిట్లు కొడుతూ టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఎదిగారు. అప్పట్లో చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ అంటే సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ. ప్రముఖ నటుడు, నిర్మాత జివి నారాయణ రావు ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

25
సీనియర్ నటుడు జివి నారాయణ రావు
Image Credit : Asianet News

సీనియర్ నటుడు జివి నారాయణ రావు

చిరంజీవి, నారాయణ రావు మధ్య మంచి స్నేహం ఉండేది. ఆయన మాట్లాడుతూ నా పెళ్లి, చిరంజీవి పెళ్లి, రాజేంద్ర ప్రసాద్ గారి పెళ్లి దాదాపుగా ఒకే సమయంలో జరిగింది. మా ముగ్గురికి తొలి సంతానం కూడా ఒకే నెలలో కలిగింది అని నారాయణ రావు అన్నారు.

Related Articles

Related image1
ప్రభాస్ తో సినిమా, క్లైమాక్స్ లో ఆ డైలాగ్ లేకుంటే మూవీ చేయను అని చెప్పిన విలన్..రిజల్ట్ ఏంటో తెలుసా ?
Related image2
Vijay Divorce: అవసరమైతే ఆ హీరోయిన్ పేరు బయటపెడతా, అప్పటి నుంచే నాకు మానసిక వేదన.. సంగీత సంచలన వ్యాఖ్యలు
35
చిరంజీవి పసివాడి ప్రాణం మూవీ
Image Credit : Asianet News

చిరంజీవి పసివాడి ప్రాణం మూవీ

చిరంజీవి పసివాడి ప్రాణం మూవీ విషయంలో జరిగిన సంఘటనని నారాయణ రావు గుర్తు చేసుకున్నారు. అది మలయాళీ సినిమా. నేను రీమేక్ హక్కులు కొన్నాను. చిరంజీవి గారికి ఆ సినిమా చూపించాను. ఆయన చేస్తే బావుంటుంది అనేది నా అభిప్రాయం. కానీ అది థ్రిల్లర్ సినిమా కావడంతో పాటలు లేవు. పాటలు లేకుంటే నా సినిమాని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనే సందేహం చిరంజీవికి కలిగింది.

45
కృష్ణంరాజు హీరోగా
Image Credit : our own

కృష్ణంరాజు హీరోగా

చిరంజీవి ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపలేదు. చక్రవర్తి మూవీ షూటింగ్ కోసం బాంబే వెళ్లిపోయారు. ఇంతలో ఇదే చిత్రాన్ని నాకు తెలియకుండా కృష్ణంరాజు హీరోగా కోదండరామిరెడ్డి ప్రారంభించారు. నా దగ్గర రీమేక్ హక్కులు ఉన్నప్పుడు వాళ్ళు అలా చేయకూడదు. నేను వెంటనే అల్లు అరవింద్ గారికి ఫోన్ చేశాను. ఈ సినిమా గురించి చెప్పాను.

55
ఇండస్ట్రీ హిట్
Image Credit : @GkParuchuri

ఇండస్ట్రీ హిట్

చిరంజీవి గారికి ఆ మూవీపై ఆసక్తి లేదు. ఇక ఎవరు చేస్తే ఏంటి అని అరవింద్ అన్నారు. లేదు ఈ సినిమా చిరంజీవి గారు చేయాల్సిందే అని పట్టుపట్టా. దీనితో అరవింద్ గారు.. అంతే అంటారా.. అయితే చూద్దాం.. వచ్చి మాట్లాడడం అన్నారు. ఆ విధంగా కృష్ణం రాజు సినిమాని ఆపేసి కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా పసివాడి ప్రాణం మూవీ ప్రారంభించాం. ఒరిజినల్ లో ఒక్క సాంగ్ లేదు. కానీ ఇందులో 6 పాటలు ఉంటాయి. ఆ విధంగా పసివాడి ప్రాణం చిత్రాన్ని కమర్షియల్ మూవీ గా మార్చాం. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా రికార్డులు క్రియేట్ చేసింది అని జివి నారాయణ రావు అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Review: రిలీజ్‌కు ముందే ధురంధర్ 2 చూసిన హీరోయిన్.. ఫస్ట్ రివ్యూ ఏంటో తెలుసా?
Recommended image2
Heroines Love Stories: డేటింగ్ ఒకరితో, పెళ్లి మరొకరితో.. క్రేజీగా ఈ స్టార్ హీరోయిన్ల లవ్ స్టోరీలు
Recommended image3
Trisha Post: రహస్య స్నేహితుడా, ప్రేమే గెలుస్తుంది.. దుమారం రేపుతున్న త్రిష పోస్ట్, హింట్‌ ఇచ్చిందా?
Related Stories
Recommended image1
ప్రభాస్ తో సినిమా, క్లైమాక్స్ లో ఆ డైలాగ్ లేకుంటే మూవీ చేయను అని చెప్పిన విలన్..రిజల్ట్ ఏంటో తెలుసా ?
Recommended image2
Vijay Divorce: అవసరమైతే ఆ హీరోయిన్ పేరు బయటపెడతా, అప్పటి నుంచే నాకు మానసిక వేదన.. సంగీత సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved