టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇంటిని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. దీంతో ప్రభాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాయదుర్గం లో తన ఇంటిని సీజ్ చేయడంపై పిటిషన్ వేశారు.

రాయదుర్గం పాన్ మక్తా సర్వే నెంబర్ 46లో ఉన్న 84 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ సుప్రీం తీర్పునివ్వడంతో నందిని హిల్స్ లో ఉన్న ప్రభాస్ ఇంటితో పాటు 
ఇతర నిర్మాణాలకు రెవెన్యూ శాఖ నోటీసులు పంపింది. 

నందిని హిల్స్ లోని తన ఇంటికి తాళం వేసిన అధికారులు, నోటీస్ అంటించారని చెబుతూ, తాను ఇంటిని క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసివున్నానని, దానిపై నిర్ణయం వెలువడకుండానే ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించారు. 

రెవెన్యూ అధికారుల నిర్ణయంపై స్టే విధించాలని ప్రభాస్ తరఫున ఆయన న్యాయవాది పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు విచారణకి రానుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.  

కోర్టు తీర్పు దెబ్బ: సినీ హీరో ప్రభాస్ ఇల్లు సీజ్