'చాయ్, సమోసా, హైదరాబాద్ వాతావరణం.. దీనికి మించింది ఇంకేముంటుంది..?' అని అంటోంది రామ్ చరణ్ సతీమణి ఉపాసన. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉండే ఉపాసన తన వ్యక్తిగత విషయాలతో పాటు చరణ్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. తన ఇంటి బాల్కనీలో నిలబడి చాయ్, సమోసా ఆస్వాదిస్తూ తీసుకున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 'అన్న(రామ్ చరణ్) లేకుండా మీరు మాత్రమే తినడం ఏం బాగాలేదు వదినా' అని ఓ నెటిజన్ కామెంట్ పెడితే.. మరో నెటిజన్ ఆ చాయ్, సమోసాల తయారీ విధానాన్ని వెల్లడించమని అడిగారు. వారు కోరినట్లుగా నిజంగానే తయారీ విధానాన్ని వీడియో రూపంలో రికార్డ్ చేసి పోస్ట్ చేశారు.