టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ భూవివాదం కేసులో తెలంగాణా రెవెన్యూ శాఖ అధికారులు సోమవారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం వద్ద ప్రభాస్ కు చెందిన స్థలాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందో తమ కౌంటర్ లో అధికారులు వివరించారు.

ఈ కౌంటర్ ని స్వీకరించిన హైకోర్టు ఈ కేసులో తదుపరి విచారణని ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. తనకు సంబంధించిన స్థలంలో రెవెన్యూ శాఖ అధికారులు జోక్యం  చేసుకొని సీజ్ చేయడంతో ప్రభాస్ హైకోర్టుని సంప్రదించాడు. 

అధికారులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఇటువంటి చర్యలకు పాల్పడినట్లు ప్రభాస్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా చూపించి తన స్థలాన్ని బలవంతంగా ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నించినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు.

అధికారుల చర్యలు తన హక్కులను హరించే విధంగా ఉన్నాయని వారిని నియంత్రించాలని ప్రభాస్ కోర్టుని కోరారు. 

ప్రభాస్ పిటిషన్.. విచారణ మళ్లీ వాయిదా!

ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ సీజ్..నేడు హైకోర్టులో విచారణ

కోర్టు తీర్పు దెబ్బ: సినీ హీరో ప్రభాస్ ఇల్లు సీజ్

ఇల్లు సీజ్: హైకోర్టులో హీరో ప్రభాస్ పిటిషన్!

ప్రభాస్ ఇంటి వివాదం.. కోర్టు ఏమంటుందంటే..?

బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు: ప్రభాస్

వాదనలు రేపు వింటాం.. ప్రభాస్ పిటిషన్ పై హైకోర్టు!