Asianet News TeluguAsianet News Telugu

అందరి ముందు బాలయ్య చేసిన పనికి హీరోయిన్ షాక్... కొంచెం ఉంటే పాపం!


పబ్లిక్ లో బాలకృష్ణ దురుసు ప్రవర్తన పలుమార్లు వివాదాస్పదం కాగా... ఈసారి ఆయన ఏకంగా హీరోయిన్ అంజలితో అనుచితంగా ప్రవర్తించాడు. బాలయ్య చర్యలతో ఆమె షాక్ కి గురి కాగా, వీడియో వైరల్ అవుతుంది. 
 

hero balakrishna indecent behavior with heroine anjali ksr
Author
First Published May 29, 2024, 2:45 PM IST

నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. అయితే ఆయన ప్రవర్తన ఒకింత వింతగా ఉంటుంది. అభిమానంతో దగ్గరకు వచ్చిన ఫ్యాన్స్ పై పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. ఓ రోడ్ షోలో అభిమాని వెనుక పరుగెత్తి తన్నిన వీడియో వైరల్ అయ్యింది. సెట్స్ లో బాలకృష్ణ సిబ్బందిని కూడా కొడతారనే టాక్ ఉంది. బాలకృష్ణతో పని చేసిన దర్శకుడు కే ఎస్ రవికుమార్ ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు. నవ్వాడని తన అసిస్టెంట్ ని బాలయ్య కొట్టబోతుంటే అపానని రవికుమార్ అన్నారు. 

ఒకటి కాదు రెండు కాదు... అనేక సందర్భాల్లో బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకున్నారు. ఈసారి ఏకంగా ఆయన ఓ హీరోయిన్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. బాలకృష్ణ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ మూవీలో అంజలి, నేహా శెట్టి హీరోయిన్స్ గా నటించారు. వేడుక చివర్లో బాలయ్యతో పాటు ఫోటోకు ఫోజిచ్చారు అంజలి, నేహా శెట్టి. ఈ క్రమంలో అంజలి కొంచెం ముందుకు వచ్చారు. 

దాంతో ఆగ్రహించిన బాలయ్య వెనక్కి ఉండాలంటూ అంజలిని తోశాడు. ఆదమరుపుగా ఉన్న అంజలి క్రింద పడబోయింది. ఊహించని పరిణామంతో  షాక్ కి గురైన ఆమె చేసేది లేక నవ్వేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. బాలయ్య తీరుపై నెటిజెన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా బాలయ్య ప్రవర్తనలో మార్పు రావడం లేదని మండిపడుతున్నారు. బాలయ్య మద్యం కూడా సేవించాడని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఆయన వాటర్ బాటిల్ పక్కనే మందుతో కూడిన మరో బాటిల్ ఉందంటున్నారు. 

కాగా అంజలి గతంలో బాలయ్యకు జంటగా నటించారు. దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన డిక్టేటర్ చిత్రంలో అంజలి హీరోయిన్. 2016లో సంక్రాంతి కానుకగా విడుదలైన డిక్టేటర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. డిక్టేటర్ షూటింగ్ సమయంలో అంజలితో ఏర్పడిన చనువుతోనే బాలకృష్ణ అలా ప్రవర్తించి ఉండొచ్చనే మరో వాదన వినిపిస్తోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios