యువ కథానాయకుడు రామ్ గత కొంత కాలంగా వరుసగా అపజయలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే మొత్తానికి దసరా సీజన్ లో విడుదలైన హలో గురు ప్రేమ కోసమే సినిమాతో పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు. సినిమా యూత్ ని ఎక్కువగా ఆకర్షిస్తోంది. త్రినాథ్ రావ్ మరోసారి తన టేకింగ్ తో పరవలేదనిపించాడు. 

ఇకపోతే హలో గురు ప్రేమ కోసమే తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆంద్రప్రదేశ్ ఏరియాల్లో శనివారం సినిమా  3 కోట్ల షేర్ ని రాబట్టింది. దీంతో తెలంగాణ ఏరియాల్లో కలుపుకొని మొత్తంగా తెలుగు స్టేట్స్ లో 10 కోట్ల షేర్స్ వచ్చాయి. నేడు ఆదివారం కావడంతో నిన్నటి నుంచే కొన్ని అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. హలో గురు ప్రేమ కోసమే ఎంత వసూలు చేసినా ఈ రోజే చెయ్యాలి. ఎందుకంటే సోమవారానికి ఫెస్టివల్ హాలిడేస్ ఎండ్ అవుతాయి. 

దీంతో నేడు సినిమాకి కలెక్షన్స్ ఎక్కువ కలెక్షన్స్ అందే అవకాశం కూడా ఉంది. అందుకే చిత్ర యూనిట్ గత కొన్ని రోజులుగా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ కూడా చేసింది. మరి టోటల్ గా రామ్ సినిమా ఎంత లాభాన్ని ఇస్తుందో చూడాలి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.

 

'హలో గురు ప్రేమకోసమే' ఫస్ట్ డే కలెక్షన్స్!

రివ్యూ: హలో గురు ప్రేమకోసమే

ప్రీమియర్ షో టాక్: హలో గురు ప్రేమ కోసమే

మంచి టైమ్ రామ్.. ఇప్పుడైనా హిట్టందుకోవయ్యా?

'అరవింద సమేత'తో తన సినిమాను పోల్చుకున్న హీరో!

అమ్మాయిలు నన్ను చూసి కుళ్లుకుంటారు.. ఏమంటావ్ అనుపమ?

‘‘హలో గురు ప్రేమకోసమే‌‌‌’’లో రామ్ ఎనర్జిటిక్ లుక్ (ఫోటోలు)