Asianet News TeluguAsianet News Telugu

ప్రీమియర్ షో టాక్: హలో గురు ప్రేమ కోసమే

నేను శైలజా తో చాలా కాలం తరువాత హిట్టందుకున్న రామ్ మళ్ళీ ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నాడు. ఇక ఇప్పుడు డిఫరెంట్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చాడు. త్రినాద్ రావ్ నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన హలో గురు ప్రేమ కోసమే దసరా సందర్బంగా రిలీజ్ కానుంది.

helo guru prema kosame premier show talk
Author
Hyderabad, First Published Oct 18, 2018, 7:27 AM IST

నేను శైలజా తో చాలా కాలం తరువాత హిట్టందుకున్న రామ్ మళ్ళీ ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నాడు. ఇక ఇప్పుడు డిఫరెంట్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చాడు. త్రినాద్ రావ్ నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన హలో గురు ప్రేమ కోసమే దసరా సందర్బంగా రిలీజ్ కానుంది. అయితే సినిమా ప్రమియర్స్ ను అమెరికాలో ప్రదర్శించారు. ఆ టాక్ ఎలా ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం. 

కాకినాడలో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసే సంజూ(రామ్) హైదరాబాద్ లో జాబ్ కోసం బయలుదేరుతాడు. ఈ ప్రయాణంలో అతనికి (అను) అనుపమ పరిచయమవుతుంది. ఇక అను తండ్రి ప్రకాష్ రాజ్ హైదరాబాద్ లో సంజుకి కి షెల్టర్ ఇస్తాడు. ట్రైనర్ గా ఐటి జాబ్ మొదలుపెట్టిన సంజూ ఆఫీస్ లో ప్రణీతను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. 

సంజూ - ప్రణీత పాత్రల మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఇక సంజు ప్రణీత ఇంటికి వెళ్ళగానే అక్కడ ఊహించని అనుభవాలను ఎదుర్కొంటాడు. సంజు ప్రణీత ప్రేమను రిజెక్ట్ చేయగా ఇంతలో ప్రకాష్ రాజ్ తన కూతురు అనుకి మ్యాచ్ సెట్ చేస్తాడు. అప్పుడు సంజు షాక్. అదే కథలో అసలైన ట్విస్ట్. 

రామ్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కామెడీ అండ్ లవ్ సీన్స్ ఉంటె ఆ సినిమా దాదాపు ప్రేక్షకులకు నచ్చినట్లే అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు హలో గురు ప్రేమకోసమే కూడా డీసెంట్ గా ఉంది. రొటీన్ గా నడిచే స్టోరీలో ట్విస్ట్ బావుంటుంది. అయితే సెకండ్ హాఫ్ లో దర్శకుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బావుండేది. 

అయితే కామెడీని అందించడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఐటి ఆఫిస్ కి సంబందించిన సీన్స్ ఆకట్టుకుంటాయి. రామ్ ఇంటర్వ్యూ సీన్ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్. ఇక ట్రయాంగిల్ లో సాగే లవ్ సీన్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ప్రకాష్ రాజ్ - రామ్ మధ్యన వచ్చే సీన్స్ పెద్దగా బోర్ కొట్టించవ్. 

ప్రకాష్ రాజ్ తన కూతురుకి రామ్ ని సెట్ చేయడం డిఫరెంట్ గా అనిపిస్తుంది. దర్శకుడు చూపించిన విధానానికి ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. ఇక సెకండ్ హాఫ్ క్లయిమాక్స్ లో సినిమా ఎమోషనల్ గా సాగుతుంది,. అనుపమ ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగా నటించింది. ప్రకాష్ రాజ్ - రామ్ కామెడీ టైమింగ్ సినిమాలో మెయిన్ హైలెట్. దసరా ఫెస్టివల్ లో హలో గురు ప్రేమ కోసమే మంచి ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు.    

 

ట్విట్టర్ టాక్:హలో గురు ప్రేమ కోసమే

మంచి టైమ్ రామ్.. ఇప్పుడైనా హిట్టందుకోవయ్యా?

'అరవింద సమేత'తో తన సినిమాను పోల్చుకున్న హీరో!

అమ్మాయిలు నన్ను చూసి కుళ్లుకుంటారు.. ఏమంటావ్ అనుపమ?

‘‘హలో గురు ప్రేమకోసమే‌‌‌’’లో రామ్ ఎనర్జిటిక్ లుక్ (ఫోటోలు)

Follow Us:
Download App:
  • android
  • ios