ఎనర్జిటిక్ హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా 'హలో గురు ప్రేమకోసమే'. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగిన సంగతి తెలిసిందే.
ఎనర్జిటిక్ హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా 'హలో గురు ప్రేమకోసమే'. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేవిశ్రీప్రసాద్ స్టేజ్ మీద మాట్లాడుతుండగా.. రామ్ వెనుక నుండి వచ్చి దేవిని మాట్లాడనివ్వకుండా మైక్ లాగేసుకుంటూ ఆయన్ని పట్టుకున్నారు.
దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోని షేర్ చేసిన దేవిశ్రీప్రసాద్.. 'నాకు తెలిసి రామ్ కి ఉన్న ఫిమేల్ ఫ్యాన్స్ అందరూ నన్ను చూసి కుళ్లుకుంటారు. నువ్వేమంటావ్ అనుపమ..?' అని అనుపమ పరమేశ్వరన్ ని ట్యాగ్ చేశారు. దీనికి సమాధానంగా ఆమె.. 'చాలా రొమాంటిక్' అంటూ ఫన్నీ కామెంట్ చేసింది.
Scroll to load tweet…
