పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ అదా శర్మ. తొలి సినిమాలోనే తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ సక్సెస్‌ పరంగా మాత్రం చాలా వెనకపడింది. తెలుగులో ఈ భామ చేసిన సినిమాలేవి పెద్దగా సక్సెస్‌ కాకపోవటంతో స్టార్‌ ఇమేజ్‌ను అందుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీ అక్కడ ఒకటి రెండు విజయాలతో పరవాలేదనిపించుకుంది. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్‌ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేసే ఈ బ్యూటీ ఎప్పటి కప్పుడు అభిమానులకు కనువిందు చేస్తూ ఉంటుంది.

తన ఫోటో షూట్‌లు, వర్క్‌ అవుట్ వీడియోలతో పాటు డైలీ రొటీన్‌లను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది అదా శర్మ. తాజాగా ఈ భామ కేవలం ఒంటి మీద బాత్‌ టవల్‌ మాత్రమే ఉన్న ఫోటోలను షేర్‌ చేసింది. ఈ ఫోటోతో పాటు తన చేతివేళ్లకు సంబంధించి కామెంట్ చేసి అదా అసలు చూపించాలనుకున్నది వేరే అంటున్నారు అభిమానులు. అంతేకాదు స్ప్రింగ్‌లాగా వంగే తన బాడీ స్పెషాలిటీను కూడా చూపిస్తూ ఓ స్టిల్ ఇచ్చింది అదా శర్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే... గత ఏడాది చార్లీ చాప్లిన్ 2, కల్కి, బైపాస్ రోడ్‌, కమాండో 3 లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం  మ్యాన్ టు మ్యాన్ అనే సినిమాలో నటిస్తుంది. అయితే లాక్ డౌన్‌ కారణంగా షూటింగ్ లకు బ్రేక్ పడటంతో ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ హాట్‌ ఫోటోలతో పాటు ఫన్నీ వీడియోలను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తోంది.