ఒకప్పుడు దక్షిణాది స్టార్ హీరోయిన్ గా తన అందంతో కుర్రకారుని ఆకట్టుకున్న నటి ఇలియానా కొన్నేళ్ల పాటు తెలుగు తెరకు దూరమైంది. మళ్లీ ఇప్పుడు రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమాతో బ్రేక్ అందుకొని టాలీవుడ్ లో సెటిల్ అయిపోదామని చూస్తోన్న ఈ బ్యూటీ ఓ యాక్షన్ హీరో కారణంగా షాక్ తగిలిందట. విశాల్ హీరోగా 'ఇంద్రుడు' అనే సినిమాను రూపొందించిన దర్శకుడు తిరు ఇప్పుడు తెలుగులో గోపీచంద్ హీరోగా ఓ బైలింగ్యువల్' సినిమాను రూపొందించాలని అనుకుంటున్నాడు.

ఈ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఇలియానాని తీసుకోవాలని అనుకున్నాడు తిరు. అయితే గోపీచంద్ మాత్రం వద్దని చెప్పాడట. ఔట్ డేటెడ్ హీరోయిన్లు ఎందుకులెండి అంటూ ఆమెని రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

'అమర్ అక్బర్ ఆంటోనీ' హిట్ అయితే కానీ ఇలియానాకి తెలుగులో ఛాన్స్ లు రావు. పైగా అమ్మడు బొద్దుగా తయారవ్వడం కూడా ఆమెకి అవకాశాలు రాకుండా ఆపేస్తుంది. మరి మునుపటిలా నాజుకుగా తయారవుతుందేమో చూడాలి! 

ఇవి కూడా చదవండి.. 

ఇలియానా వీడియోకి షాకింగ్ వ్యూస్!

ఇలియానాని త్రివిక్రమే పంపాడట!

ఇలియానా ఇక మారదా..?

అమర్ అక్బర్ ఆంథోనీలో ఇలియానా లుక్స్ అదుర్స్

మొదటి సారి ఇలియానా తెలుగు మాట్లాడేస్తోంది!

నడుం కోసం ఇలియానా పాట్లు!