కరోనా మహమ్మారి వినోద రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. సినిమాలకు సంబంధించిన పనులు ఆగిపోయి మూడు నెలలు దాటింది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఖాళీ సమయాల్లో అభిమానులతో టచ్‌లో ఉండేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు తారలు. కొంత మంది తమ లాక్‌ డౌన్‌ రొటీన్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటుండగా, మరికొందరు త్రో బ్యాక్‌ ఫోటోలతో అలరిస్తున్నారు.

గోవా బ్యూటీ ఇలియానా కూడా సోషల్‌  మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కొన్ని హాట్‌ ఫోటోలను షేర్‌ చేసింది. గతంలో తాను ఓ బీచ్‌లో సేద తీరుతుండగా తీసిన ఫోటోలను ఇప్పుడు సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. టూ పీస్‌ బికినీలో అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలను షేర్  చేసిన ఇల్లి బేబీ. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే గత ఏడాది పాగల్‌ పంతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం అభిషేక్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది బిగ్‌ బుల్‌ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్‌ కానుంది. ఈ సినిమాతో పలు తెలుగు చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది ఈ బ్యూటీ.