అడల్ట్ చిత్రాలతో పాపులర్ అయిన ప్రముఖ నటి జెస్సికా హఠాన్మరణం చెందారు. ఆమె మరణం ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది. తన రూమ్ లోనే జెస్సికా ప్రాణాలు కోల్పోయి విఘాత జీవిగా కనిపించింది. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. 

గత కొన్నాళ్లుగా జెస్సికా జేమ్స్ పోర్న్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. 40 ఏళ్ల జెస్సికా పలు ఆరోగ్య కారణాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అసలు వివరాల్లోకి వెళితే..  ఆమె స్నేహితుడు శాన్ పెర్నాండో కొన్ని గంటలుగా జెస్సికాను కాంటాక్ట్ చేయాలని ప్రయత్నం చేశాడు. 

అయితే ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో వెంటనే జెస్సికా ఇంటికి వెళ్లి చూశాడు. కానీ అక్కడ జెస్సికా స్పృహలో లేకుండా కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వైద్యులు ఆమెను పరీక్షించి మరణించినట్లు నిర్దారించారు. అయితే జెస్సికా చాలా రోజులుగా మూర్ఛ వ్యాధితో భాదపడుతున్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం ఆమె మరణానికి గల కారణాలు తెలియజేస్తామని అధికారులు వివరణ ఇచ్చారు.