బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ అతని భార్య మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. విడిపోయిన తరువాత నవాజ్‌ మీద సంచలన ఆరోపణలు చేసింది ఆయన మాజీ భార్య ఆలియా. నవాజ్‌ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా సంచలన ఆరోపణలు చేసింది ఆలియా. తాజాగా ఆమె మరోసారి నవాజ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.

తాను పురిటినొప్పులు పడుతుంటూ నవాజ్‌ అమ్మాయిలతో రొమాన్స్‌ చేసేవాడంటూ ఆలియా ఆరోపించింది. `నాకు ఒక్కసారి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే హాస్పిటల్‌లో చేర్చారు. నవాజ్‌ కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి వచ్చారు. కొన్ని కాంప్లికేషన్స్ కారణంగా కొద్ది రోజులు హాస్పిటల్‌లోనే ఉండాల్సి వచ్చింది. కానీ ఆ సమయంలో నా భర్త నవాజ్‌ నాతో ఉండేవాడు కాదు.

డెలివరీ తరువాత ఇంటికి వచ్చే సమయానికి నాకు ఓ విషయం తెలిసింది. అప్పట్లో నవాజ్‌ గంటల కొద్ది అమ్మాయిలతో ఫోన్‌లో మాట్లాడేవాడు. అంతేకాదు కొన్ని సార్లు అమ్మాయిలను ఇంటికి కూడా తీసుకువచ్చేవాడు అని నాకు తెలిసింది అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు ఈ విషయాలన్ని తనకు నవాజ్‌ సోదరుడే చెప్పాడని చెప్పింది అలియా.

నవాజ్‌కు పెళ్లిక ముందు నుంచే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని ఆ విషయంలో తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవని కూడా చెప్పింది. పెళ్లి తరువాత కూడా నవాజ్‌ అమ్మాయిలతో సంబంధాలు కొనసాగించాడని అందుకే తాను విడాకులు తీసుకున్నానని చెప్పింది.