Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ : సురేంద్రరెడ్డి.. వెబ్ సీరిస్, అరవింద్ నిర్మాత

గేమ్ ఆఫ్ థ్రోన్ తరహాలో ఓ భారీ వెబ్ సీరిస్ సురేంద్రరెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ సీరిస్ కు సురేంద్ర రెడ్డి డైరక్ట్ చేస్తారా..లేక దర్శకత్వ పర్య వేక్షణ చేస్తాడా అనేది ఇంకా తేలలేదు. త్వరలో ప్రారంభం కానున్న ఈ వెబ్ సీరిస్ కు సంభందించి ఇప్పటికే స్క్రిప్టు వర్క్ జోరుగా సాగుతోందని చెప్తున్నారు. తెలుగు డిజిటల్ తెరపై చూడని ఎడ్వేంచర్స్ తో ఈ సీరిస్ నిండి ఉంటుందని, తన మార్క్ స్క్రీన్ ప్లేని ఇందులో చూపెట్టబోతున్నట్లు సమాచారం. 

Director surendra reddy next a web series
Author
Hyderabad, First Published Jun 14, 2020, 12:13 PM IST

ప్రముఖ దర్శకుడు సురేంద్ర రెడ్డికు ఇండస్ట్రీలో, సినీ లవర్స్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.అతనొక్కడే తో మొదలెట్టి మొన్నటి సైరా వరకు అనేక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేసారు ఆయన. చిన్న సినిమాలు ఎప్పుడూ తన కెరీర్ లో చేయని సురేంద్రరెడ్డి ఇప్పుడు ఓ వెబ్ సీరిస్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం. సైరా తర్వాత ఏ హీరో తోనూ ఇంకా ఏ ప్రాజెక్టు ఫైనలైజ్ కాలేదు. ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కోరికపై ఓ వెబ్ సీరిస్ కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఆహా కోసం రూపొందే ఈ వెబ్ సీరిస్ కు అల్లు అరవింద్ నిర్మాతగా ఉండబోతున్నారు. 

గేమ్ ఆఫ్ థ్రోన్ తరహాలో ఓ భారీ వెబ్ సీరిస్ సురేంద్రరెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ సీరిస్ కు సురేంద్ర రెడ్డి డైరక్ట్ చేస్తారా..లేక దర్శకత్వ పర్య వేక్షణ చేస్తాడా అనేది ఇంకా తేలలేదు. త్వరలో ప్రారంభం కానున్న ఈ వెబ్ సీరిస్ కు సంభందించి ఇప్పటికే స్క్రిప్టు వర్క్ జోరుగా సాగుతోందని చెప్తున్నారు. తెలుగు డిజిటల్ తెరపై చూడని ఎడ్వేంచర్స్ తో ఈ సీరిస్ నిండి ఉంటుందని, తన మార్క్ స్క్రీన్ ప్లేని ఇందులో చూపెట్టబోతున్నట్లు సమాచారం. 

ఇక సురేంద్రరెడ్డి కెరీర్ లో మొదలైన ఈ  15ఏళ్లలో తొమ్మిది సినిమాలు డైరెక్ట్ చేశాడు. అతనొక్కడే చిత్రం సొంత కథతో తెరకెక్కించగా.. మిగిలిన 8 సినిమాల కోసం రైటర్స్ పై ఆధారపడ్డాడు సురేంద్రరెడ్డి. అతనొక్కడే.. సైరా.. ధృవ మినహా ఆరు సినిమాలకు వక్కంతం వంశీ కథ అందించాడు.చిరంజీవితో తీసిన సైరా.. సురేంద్ర రెడ్డి కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. దర్శకుడు తన కెరీర్ ఫస్ట్ టైమ్ భారీ గ్రాఫిక్స్ తో ఈ హిస్టారికల్ మూవీని రూపొందించాడు. కమర్షియల్ గా సినిమా వర్కవుట్ కాకపోయినా బాగానే తీశాడన్న పేరు తెచ్చుకున్నాడు.  సినిమా రిలీజై ఆరు నెలలు దాటినా.. తర్వాతి ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేయలేదు. స్టార్ హీరోలు ఎవరికి వాళ్లు కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటమే అందుకు కారణం.

Follow Us:
Download App:
  • android
  • ios