Asianet News TeluguAsianet News Telugu

ఆ స్టేట్మెంట్ వల్ల నన్ను ఇరికించారు.. డ్రగ్స్ కేసుపై డైరెక్టర్ క్రిష్ కామెంట్స్

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ అనుమానితుడిగా ఎఫ్ఐఆర్ లో చేర్చబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

Director Krish latest comments on Drugs case dtr
Author
First Published Mar 1, 2024, 4:24 PM IST

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ అనుమానితుడిగా ఎఫ్ఐఆర్ లో చేర్చబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్శకుడు క్రిష్ విచారణ ఎదుర్కొనక తప్పదు అన్నట్లుగా డీసీపీ వినీత్ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. 

దీనితో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. విచారణకి హాజరు కావాలని పోలీసులు క్రిష్ ని కోరడంతో.. అతడు తనకి రెండు రోజుల సమయం కావాలని కోరాడు. అయితే క్రిష్ ముందస్తు బెయిల్ విచారణ నేడు కోర్టులో జరిగింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. 

ఈ క్రమంలో క్రిష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. డ్రగ్స్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. హోటల్ ఓనర్ వివేకానంద ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల నన్ను ఇరికించారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని క్రిష్ తెలిపాడు. 

క్రిష్ కి వైద్యపరీక్షలు నిర్వహించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా వివేకానందతో అతడికి ఉన్న సంబంధాలు ఏంటనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆల్రెడీ డిసిపి వినీత్.. క్రిష్ కి రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించాలని మీడియా ముఖంగా తెలిపారు. మరి క్రిష్ సహాకరిస్తారో లేదో చూడాలి. 

  తాను రాడిసన్ హోటల్ కి వెళ్లిన మాట వాస్తవమే అని అంగీకరించారు. తన స్నేహితులని కలిసేందుకు అక్కడికి వెళ్లినట్లు క్రిష్ పేర్కొన్నారు. తన డ్రైవర్ రావడం ఆలస్యం కావడంతో హోటల్ యజమాని వివేకానందతో కాసేపు మాట్లాడానని.. డ్రైవర్ రాగానే అక్కడికి నుంచి వెళ్లిపోయినట్లు క్రిష్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios