Asianet News TeluguAsianet News Telugu

జాతీయ మీడియా బాలుకు సరైన గౌరవం ఇవ్వలేదు: ఫైర్ అయిన హరీష్ శంకర్

లెజెండరీ సింగర్ బాలు మరణాన్ని బాలీవుడ్ మీడియా పట్టించుకోకపోవడాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తప్పుబట్టారు. దీనితో హరీష్ శంకర్ తనదైన శైలిలో బాలీవుడ్ మీడియాపై సెటైర్ వేశారు.

director harish shankar satires on bollywood media ksr
Author
Hyderabad, First Published Sep 26, 2020, 8:36 PM IST

చెన్నైలోని ఎస్పీ బాలసుబ్రమణ్యం ఫార్మ్ హౌస్ లో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాల మధ్య ఎస్పీ బాలు అంత్యక్రియలు కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. కరోనా నేపథ్యంలో కోలీవుడ్, టాలీవుడ్ కి చెందిన చిత్ర ప్రముఖులు ఎవరూ బాలు పార్దీవ దేహాన్ని సందర్శించలేదు. కోలీవుడ్ నుండి ఒక్క విజయ్ మాత్రమే హాజరయ్యారు. అలాగే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ సైతం బాలు అంత్యక్రియలకు హాజరయ్యారు. 

ఐతే సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాలలో బాలు మరణం హాట్ టాపిక్ గా మారింది. సౌత్ ఇండియాలో అన్ని బాషల మీడియా బాలు మరణంపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. బాలు గొప్పతనాన్ని కొనియాడడంతో, ఆయన మృతి పరిశ్రమకు తీరని లోటుగా అభివర్ణించాయి. కాగా జాతీయ మీడియా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. ఎదో మొక్కుబడిగా బాలు మరణం గురించి ప్రస్తావించడం జరిగింది.

 
బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దా కపూర్ మరియు సారా అలీ ఖాన్ పేర్లు బయటికి రావడంతో పాటు రకుల్ నిన్న ఎన్సీబీ ముందు విచారణకు హాజరయ్యారు. జాతీయ మీడియా తన ఫోకస్ మొత్తం ఈ విషయంపైనే పెట్టింది. 

 

ఈ నేపథ్యంలో లెజెండరీ సింగర్ కి నేషనల్ మీడియా సరైన గౌరవం ఇవ్వలేదని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ మీడియాపై ఆయన సెటైర్ వేయడం జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత బిబిసి ఛానెల్ లో బాలు గారిపై ప్రసారం అయిన కథనానికి సంబంధించిన వీడియో షేర్ చేయడంతో పాటు..'ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత  అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో... మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది..అంతేలే..కొందరి స్థాయి విశ్వవ్యాప్తం..ఇరుకు సందుల్లో కాదు' అని సెటైర్ వేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios