Asianet News TeluguAsianet News Telugu

కమెడియన్ ఇంట విషాదం, రఘు కారుమంచి కి పితృవియోగం, పలువురు ప్రముఖుల సంతాపం

వెండితెరపై ఎప్పుడూ నవ్వులు పూయించే కమెడియన్ ఇంట విషాదం నెలకొంది. ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించే హాస్యనటుడు.. దుఖంతో కుమిలిపోయే సందర్భం ఎదురయ్యింది. స్టార్ కమెడియన్ రఘు కారుమంచి తండ్రి వెంకట్రావ్ కన్నుమూశారు.   
 

comedian Raghu father Venkata Rao  passes away
Author
Hyderabad, First Published Aug 4, 2022, 10:28 PM IST

ప్రముఖ హాస్యనటుడు రఘు కారుమంచి(అదుర్స్ రఘు) ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెంకట్రావ్ కారుమంచి (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న  వెంకట్రావ్ గురువారం తుదిశ్వాస విడిచారు. జూన్ 10, 1947లో జన్మించిన వెంకట్రావ్ ఆర్మీ అధికారిగా సేవలదించారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన ఇంటిదగ్గరే వున్నారు.  రఘు తండ్రి వెంకట్రావ్ మృతి పట్ల జబర్దస్త్ కమెడియన్స్ విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. రఘు తండ్రి మరణించారని తెలిసి బంధు మిత్రులతో పాటు.. పలువురు సినీ ప్రముఖులు ఆయనకి సంతాపం తెలుపుతున్నారు.

ఇక రఘు విషయానికి వస్తే.. ఆయన కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అదుర్స్ సినిమాలో తన కామెడీతో అందర్నీ మెప్పించి.. మంచి కమెడియన్ గా మెప్పించి.. పేరు తెచ్చుకున్నాడు. అంతే కాదు స్టార్ హీరోలు నటించిన  పలు సినిమాల్లోఫుల్ లెన్త్ కమెడి పాత్రల్లో నటించాడు  రఘు. ఆ తర్వాత జబర్దస్త్ లో రోలర్ రఘు పేరుతో పాపులర్ అయ్యాడు. జబర్దస్త్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన రఘు.. అవకాశాలు తగ్గిపోవడంతో సొంతూరు వెళ్లి  లిక్కర్ బిజినెస్ చేసుకుంటున్నాడు. లిక్కర్ బిజినెస్ తో పటు వ్యావసాయం చేస్తూ.. అక్కడే సెటిల్ అయిపోయాడు. ఇక తను ఎంతో ప్రేమించే తండ్రి మరణంతో రఘు దుఖంలో మునిగిపోయాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios