సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చే చాలా మంది అమ్మాయిలను కొందరు మోసం చేస్తున్నారు. ఇటువంటి కేసులు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇటువంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది.

హైదరాబాద్ లో బోడుప్పల్ కి చెందిన ఓ యువతి సినిమా అవకాశాల కోసం సినిమాటోగ్రాఫర్ శన్ముఖ్ వినయ్ ని కలిశారు. వినయ్ బాధితురాలికి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించాడు. 

జనవరిలో సినిమా ఛాన్స్ ఒకటి ఉందని, మాదాపూర్ లో ఓ గెస్ట్ హౌస్ కు బాధితురాలిని పిలిపించి ఆమెపై లైంగిక దాడికి పలపాడ్డాడు. ఆమె నిలదీయంతో పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టాడు. ఆ తరువాత వినయ్ ముఖం చాటేయడంతో సదరు యువతి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదుతో వినయ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు రేపు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వినయ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.