దర్శకుడు బోయపాటి శ్రీను.. రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ వ్యవహారాలు మొత్తం 
కూడా చరణ్ పీఆర్ టీమ్ చూసుకుంటుంది. వీరు చేస్తోన్న పబ్లిసిటీ విషయంలో బోయపాటి సంతోషంగా లేరని తెలుస్తోంది.

దాదాపు బోయపాటి  సినిమాలన్నింటికీ పబ్లిసిటీ వ్యవహారాలు ఆయన పెర్సనల్ టీమ్ చూసుకుంటుంది. కానీ ఈసారి చరణ్ ఆ ఛాన్స్ ఇవ్వకపోవడంతో చేసేదేం లేక పబ్లిసిటీ వ్యవహారాలు వారికే వదిలేశాడు.

అయితే సినిమాపై రూమర్లు రావడం ఎక్కువవ్వడం, చరణ్ కి.. బోయపాటికి అసలు పడడం లేదని వార్తలు వినిపిస్తుండడంతో ఈ నెగెటివ్ పబ్లిసిటీ విషయంలో బోయపాటి హర్ట్ అయినట్లు తెలుస్తోంది. పైగా సినిమా టైటిల్ ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదని ఫ్యాన్స్ కూడా బోయపాటినే టార్గెట్ చేస్తున్నారు. దీంతో చరణ్ పీఆర్ టీమ్ రూమర్స్ ని క్రియేట్ చేయడం తప్ప ఏం చేయడం లేదని బోయపాటి మండిపడుతున్నారు. 

సినిమా షూటింగ్ లేట్ అవుతుందని, సంక్రాంతికి రాదనే వార్తలు వినిపిస్తుండడంతో నిర్మాత దానయ్య ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చేశాడు. సినిమా అనుకున్నట్లుగానే  సంక్రాంతికి విడుదలవుతుందని ఫస్ట్ లుక్ కూడా త్వరలోనే విడుదల కానుందని అనౌన్స్ చేశారు. 

ఇవి కూడా చదవండి..

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?

చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?

చరణ్ సినిమా టైటిల్ ఇదేనట!

బోయపాటి తీరుతో నిర్మాత అసహనం!

ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!

షూటింగ్ లకి రామ్ చరణ్ డుమ్మా.. కారణమేమిటంటే..?

రామ్ చరణ్-బోయపాటి సినిమా టైటిల్ ఇదే..!