Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ కేసు సంచలనం: ఎన్సీబీ అదుపులో బడా హీరో కొడుకు

 
ఇపుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  హవాల రూపంలో జరిగిన లావాదేవీలపై ఇంటర్‌పోల్ సహాయం తీసుకుంటోంది. దీంతో ఈ కసుతో సంబంధం ఉన్న నటీనటులకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీస్తోంది.

Bollywood Star heros Son Detained With Drugs
Author
Mumbai, First Published Oct 3, 2021, 6:52 AM IST

టాలీవుడ్ డ్రగ్స్  కేసులో  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  ఇప్పటికే పలువురు సినీ నటులు, దర్శకులను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసింది. అంతకు ముందు కన్నడ పరిశ్రమలో  డ్రగ్స్ భారీ ప్రకంపనలు పుట్టించాయి. వాటిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అన్ని చోట్లా చిన్న పెద్దా అని తేడా లేకుండా చాలా మంది హీరోలు, హీరోయిన్లు, నటీనటుల, డైరక్టర్స్ చుట్టూ డ్రగ్స్ రాకేట్ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆ కేసులలో స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఉండటం సంచలనం అవుతోంది. ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ మాఫియా.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీలకి కూడా పాకి మళ్లీ బాలీవుడ్ దగ్గరికే వచ్చి ఆగింది. 

తాజాగా  ముంబైలోని ఒక పెద్ద క్రూయిజ్ షిప్‌లో సోదాలు నిర్వహించింది. ఈ క్రూయిజ్​లో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక పెద్ద బాలీవుడ్​ హీరో కుమారుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో  గత కొన్ని రోజులుగా ముంబైలో దాడులు ముమ్మరం చేసింది.  అందులో భాగంగానే NCB ముంబైలోని ఒక పెద్ద క్రూయిజ్ షిప్‌లో సోదాలు నిర్వహించింది. ఈ క్రూయిజ్​లో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

అయితే  అందులో ఒక బాలీవుడ్​ స్టార్ హీరో కుమారుడు కూడా ఉండటమే ఇప్పుడు సెన్సేషన్ అయ్యింది. ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మీడియా,పోలీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ముంబైలోని సముద్రంలో కార్డెలియా క్రూయిజర్‌ లో పార్టీ జరిగింది. ఈ పార్టీ కి ముంబైలోని కోటిశ్వరలు,సెలబ్రెటీ హాజరయ్యారు. ఆ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు ఎన్‌సీబీ టీమ్ కి సమాచారం అందింది. దీంతో ఎన్‌సీబీ స్క్వాడ్  దాడి చేసింది.

 ఈ క్రూయిజ్‌లో ఒక ఫ్యాషన్ షో  జరిగింది. బాలీవుడ్ నుంచి చాలా మంది  ప్రముఖులు  హాజరయ్యారు. దాదాపు  పదిహేను వందల మంది క్రూయిజ్‌కు హాజరైనట్లు సమాచారం. ఇందులో ఢిల్లీ నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ లు కూడా ఉన్నారు. చాలా మంది  డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో NCB పెద్ద మొత్తంలో కొకైన్, డ్రగ్స్, MD డ్రగ్‌లను స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్‌లో చాలా మందిని అరెస్టు చేశారు.  పూర్తి వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios