బిగ్ బాస్ సీజన్ 2లో ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని విషయాన్ని ముందుగానే వెల్లడించారు. ఓట్ల ప్రకారంలో గణేష్, అమిత్ వెనుకంజలో ఉన్నారని ఈ వారంలో గణేష్, అమిత్ లు బయటకు వెళ్లిపోయే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపించాయి. అనుకున్నట్లుగానే శనివారం ఎపిసోడ్ లో గణేష్ ఎలిమినేట్ అయినట్లుగా హోస్ట్ నాని ప్రకటించారు.

కౌశల్ సేవ్ అయినట్లుగా వెల్లడించడంతో మిగిలిన ముగ్గురు సామ్రాట్, అమిత్, నూతన్ లలో అమిత్ వెళ్లిపోతాడనుకుంటే.. అనూహ్యంగా ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నూతన్ హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్నాడని నాని ప్రకటించి షాక్ ఇచ్చాడు. రీఎంట్రీలో మరోసారి హౌస్ లోకి వెళ్లిన నూతన్ భుజానికి గాయం కావడంతో మరోసారి హౌస్ నుండి బయటకి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకొని మళ్లీ హౌస్ లోకి వచ్చారు.

మూడోసారి అతడు హౌస్ లోకి అడుగుపెట్టడం అటు హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా వ్యతిరేకత వచ్చింది. బిగ్ బాస్ షోని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వచ్చాయి. ఇక వెళ్లిపోతూ వెళ్లిపోతూ.. బిగ్ బాంబ్ ని కౌశల్, దీప్తిలపై విసిరాడు నూతన్ నాయుడు. దీనిప్రకారం ఈ వారం మొత్తం హౌస్ లో ఎవరేం తిన్నా.. ఆ గిన్నెలు మొత్తం వీరిద్దరే శుభ్రం చేయాలి!

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: నూతన్ నాయుడు ఎలిమినేట్ కానున్నాడా..?

బిగ్ బాస్2: సామాన్యుడు గణేష్ ఔట్!

'కౌశల్ ఆర్మీ'ని వాడుకుందామని కామెంట్స్ చేసిన గీతాపై నెటిజన్లు ట్రోలింగ్!

బిగ్ బాస్2: ఈ డ్రామాలేంటి..? బిగ్ బాస్ పై తనీష్ ఫైర్!

కౌశల్ కి ఉన్న ఏకైక అభిమాని నాని మాత్రమే.. బాబు గోగినేని కామెంట్స్!