బిగ్ బాస్ సీజన్2 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన బాబు గోగినేని  కొద్దిరోజుల క్రితం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అలా బయటకి వచ్చిన ఆయన ఈ షోపై అలానే కౌశల్ పై పలు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. కౌశల్ ఆర్మీని ఉద్దేశిస్తూ.. యుద్ధం సోషల్ మీడియాలో కాదు.. ఇండియన్ బోర్డర్ లో చేయాలి.. అంటూ కౌశల్ ఆర్మీపై మండిపడ్డారు.

అంతేకాదు.. తను బిగ్ బాస్ లో కొనసాగుతున్న రోజుల్లో కౌశల్ తన భార్య గురించి బాబు గోగినేనితో చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ.. తన భార్య తనకోసం చాలా చేస్తోందని చెప్పిన విషయాలను బయటపెడుతూ అప్పుడు ఆ మాటలు కౌశల్ ఎందుకు అన్నాడో.. ఇప్పుడు అర్థమవుతోందని కామెంట్స్ చేశాడు బాబు గోగినేని.అలానే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వారు చాలా మంది డీల్ కుదుర్చుకుంటున్నారని ఒక ఛానెల్ హెడ్ తనతో చెప్పిన విషయాన్ని బయటపెడుతూ ఇది సరైన పద్ధతి కాదంటూ బాబు గోగినేని అన్నారు.

వైల్డ్ కార్డు ఎంట్రీని కూడా తప్పుబట్టారు. అలానే కౌశల్ కి ఇంతమంది అభిమానులు ఉన్నారని తాను అనుకోవడం లేదని తనకు తెలిసినంత వరకు కౌశల్ ఏకైక అభిమాని నాని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా తప్పు చేస్తే హౌస్ మేట్స్ అందరినీ విమర్శించే నాని.. కౌశల్ తప్పులు మాత్రం పట్టించుకోడని అన్నారు.