బిగ్ బాస్ సీజన్ 2 లో శుక్రవారం జరిగిన ఎపిసోడ్ రసవత్తరంగా సాగిందనే చెప్పాలి. కెప్టెన్ టాస్క్ లో భాగంగా 'అలిసిపోతే అంతమే' అనే సైకిల్ టాస్క్ లో తనీష్, రోల్ రైడా, నూతన్ నాయుడు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. ఈ టాస్క్ జరుగుతున్న సమయంలో నూతన్ సైకిల్ చైన్ పట్టేయడంతో దాన్ని సరి చేయాలని ప్రయత్నించినా కౌశల్ ని దీప్తి అడ్డుకుంది. దీంతో కౌశల్ ఆమెపై ఫైర్ అయ్యాడు.

ఈ విషయంలో బిగ్ బాస్ కలుగజేసుకొని చైన్ సరిచేయవచ్చని చెప్పడంతో కౌశల్ సరిచేశాడు. కానీ పదే పదే సైకిల్ చైన్ పట్టేస్తుండడంతో నూతన్ రిలాక్స్ అవ్వడానికి సమయం దొరకడంతో దీనిపై మిగిలిన ఇద్దరు కెప్టెన్ పోటీదారులు రోల్, తనీష్ లు అభ్యతరం వ్యక్తం చేశారు. నూతన్ కి సరైన సైకిల్ ఇవ్వకుండా బిగ్ బాస్ తప్పు చేశారని.. దీంతో నూతన్ రిలాక్స్ అవుతున్నాడని తనీష్ మండిపడ్డాడు.

కాలు సరిగ్గా లేకపోయినా గేమ్ ఆడుతుంటే.. బిగ్ బాస్ ఇలా చేయడం కరెక్ట్ కాదని.. ఇది గేమ్ ఎలా అవుతుందని తనీష్ కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పుకున్నాడు. ఆ తరువాత నూతన్ ని కెప్టెన్ చేయడానికి బిగ్ బాస్ ఈ డ్రామాలు ఆడుతున్నారని, డైరెక్ట్ గా అతన్నే కెప్టెన్ చేసుకోవచ్చు కదా మా ఎనర్జీతో ఎందుకు ఆడుకోవడం అంటూ సామ్రాట్ వద్ద ఎమోషనల్ అయ్యాడు తనీష్.

ఇక బజర్ మోగే సమయానికి సైకిల్ మీద ఇద్దరూ ఉంటే ఈ వారం కెప్టెన్ గా ఎవరూ ఉండరని బిగ్ బాస్ సూచించారు. దీంతో గీత హౌస్ మేట్స్ మద్దతుతో నూతన్ ని డ్రాప్ అవ్వమని కోరగా దానికి ఆయన, కౌశల్ అంగీకరించలేదు. బజర్ మోగే సమయానికి నూతన్, రోల్ సైకిల్ మీదే ఉండడంతో ఈ వారం ఎవరూ కెప్టెన్ కాలేరని బిగ్ బాస్ తేల్చేశారు. 

ఇవి కూడా చదవండి.. 

కౌశల్ కి ఉన్న ఏకైక అభిమాని నాని మాత్రమే.. బాబు గోగినేని కామెంట్స్!

బిగ్ బాస్2..ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్