బిగ్ బాస్2: సామాన్యుడు గణేష్ ఔట్!

First Published 1, Sep 2018, 11:26 PM IST
bigg boss2: ganesh eliminated from house
Highlights

బిగ్ బాస్ సీజన్2 చివరి దశకు చేరుకుంటుండడంతో షోపై ఆసక్తి మరింత పెరిగిపోతుంది. ఇప్పటికే హౌస్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 

బిగ్ బాస్ సీజన్2 చివరి దశకు చేరుకుంటుండడంతో షోపై ఆసక్తి మరింత పెరిగిపోతుంది. ఇప్పటికే హౌస్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వారం ఎలిమినేషన్ లో భాగంగా సామాన్యుడు గణేష్ ఎలిమినేట్ అయ్యాడు. మొదటి నుండి కూడా గణేష్ ఆటపై అటు హౌస్ మేట్స్ లో ఇటు ప్రేక్షకుల్లో ఒకింత అసంతృప్తి నెలకొందనే చెప్పాలి.

మధ్యలో మధ్యలో కాస్త జోరు పెంచినట్లుగా అనిపించినా.. హౌస్ లో అతడి ప్రవర్తన కారణంగా చివరకి హౌస్ నుండి ఎలిమినేట్ కాక తప్పలేదు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే సంగతి తెలిసిందే. నామినేషన్స్ లో సామ్రాట్, నూతన్ నాయుడు, అమిత్, కౌశల్, గణేష్ లు ఉండగా గణేష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఆదివారం మరో ఎలిమినేషన్ ఉంటుందని చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు.

కౌశల్ సేవ్ అయినట్లుగా నాని ప్రకటించడంతో సామ్రాట్, నూతన్, అమిత్ లలో అమిత్ కి తక్కువ ఓట్లు పడడంతో ఆయన బయటకి వెళ్లిపోయే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి.. 

'కౌశల్ ఆర్మీ'ని వాడుకుందామని కామెంట్స్ చేసిన గీతాపై నెటిజన్లు ట్రోలింగ్!

బిగ్ బాస్2: ఈ డ్రామాలేంటి..? బిగ్ బాస్ పై తనీష్ ఫైర్!

కౌశల్ కి ఉన్న ఏకైక అభిమాని నాని మాత్రమే.. బాబు గోగినేని కామెంట్స్!

బిగ్ బాస్2..ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్

loader