'కౌశల్ ఆర్మీ'ని వాడుకుందామని కామెంట్స్ చేసిన గీతాపై నెటిజన్లు ట్రోలింగ్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 1, Sep 2018, 12:53 PM IST
kaushal army targets geetha madhuri
Highlights

'మర్డర్ మిస్టరీ' టాస్క్ లో గీతా గెలుపొందిన కారణంగా ఆమెకు హౌస్ లో ఒకరిని సీజన్ మొత్తం నామినేట్ చేసే ఛాన్స్ రాగా.. ఒక్క నిమిషం ఆలోచించి వెంటనే కౌశల్ పేరు చెప్పేసింది. 

'మర్డర్ మిస్టరీ' టాస్క్ లో గీతా గెలుపొందిన కారణంగా ఆమెకు హౌస్ లో ఒకరిని సీజన్ మొత్తం నామినేట్ చేసే ఛాన్స్ రాగా.. ఒక్క నిమిషం ఆలోచించి వెంటనే కౌశల్ పేరు చెప్పేసింది. దానికి అతడు తరువాత గీతాను పర్సనల్ గా కారణాలు అడగగా.. ఎప్పటిలానే తను చెప్పే రెండు, మూడు కారణాలు చెప్పేసి ఊరుకుంది. అయితే కౌశల్ ని నామినేట్ చేసిన తరువాత గీతా వెటకారంగా.. కౌశల్ కి కౌశల్ ఆర్మీ ఉంది కదా.. వాడుకుందాం అంటూ సెటైర్లు వేసింది.

ఈ విషయంలో కౌశల్ కంటతడి కూడా పెట్టుకోవడంతో మరోసారి ఆమెని కౌశల్ ఆర్మీ టార్గెట్ చేసింది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఓట్లు వేసి గెలిపించే జనాలపై కామెంట్లు వేస్తావా..? నీకు కనీసం గౌరవ, మర్యాదలు కూడా తెలియవా..? అంటూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. మరికొందరు 'నువ్ కౌశల్ ని నామినేట్ చేస్తావని మాకు తెలుసు.. నీకు దిమ్మతిరిగే విధంగా కౌశల్ అన్నకు ఓట్లు వేసి చూపిస్తాం కాస్కో..' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నిన్నటి షోలో కూడా గీతా.. నూతన్ నాయుడిని కెప్టెన్సీ పోటీ నుండి తప్పుకోమని అడిగినప్పుడు కౌశల్ అడ్డుపడగా.. నేను మీతో మాట్లాడడం లేదు.. మీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకు లేదంటూ చెప్పడంతో మరోసారి వీరిద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది!

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: ఈ డ్రామాలేంటి..? బిగ్ బాస్ పై తనీష్ ఫైర్!

కౌశల్ కి ఉన్న ఏకైక అభిమాని నాని మాత్రమే.. బాబు గోగినేని కామెంట్స్!

బిగ్ బాస్2..ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్

loader