బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న గీతామాధురికి జనాల్లో ఆదరణ కూడా బాగానే ఉంది. టాస్క్ లను తనదైన రీతిలో ఆడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే హౌస్ లో సామ్రాట్ తో గీత ప్రవర్తనపై సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. సామ్రాట్-గీతా సన్నిహితంగా మెలగడం జనాల్లో నెగెటివ్ ఫీలింగ్ వచ్చేలా చేస్తుంది. ఈ విషయంపై దీప్తి, శ్యామల.. గీతామాధురిని హెచ్చరించే ప్రయత్నం కూడా చేశారు.

కానీ ఆమె సింపుల్ గా మీరు చాలా కన్జర్వేటివ్ గా ఆలోచిస్తున్నారంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చేసింది. దీంతో వాళ్లు మాకు మాత్రం ఎందుకన్నట్లు ఊరుకుండిపోయారు. ఇక రీసెంట్ గా జరిగిన పెళ్లి టాస్క్ లో గీతామాధురిని సామ్రాట్, రోల్ రైడా ముద్దుపెట్టుకున్నారు. ఈ విషయంలో గీతా భర్త నందు చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో భాగంగా రోల్ రైడా.. గీతామాధురిని ముద్దుపెట్టుకోవాలి. దీంతో రోల్ గీతా నుదుటి మీద ముద్దుపెట్టుకున్నాడు.

సామ్రాట్ చనువు తీసుకొని గీతా బుగ్గలపై ముద్దుపెట్టడంపై నందు చాలా అప్ సెట్ అయ్యాడట. టాస్క్ లో భాగంగా అలా చేసి ఉన్నా కన్సిడర్ చేసేవాడేమో కానీ సామ్రాట్ కావాలని గీతాని ముద్దుపెట్టుకోవడంతో నందు అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. ఒక పెళ్లైన అమ్మాయిని ఇలా బుల్లితెర ప్రేక్షకులు చూసే పాపులర్ షోలో ఇద్దరు వ్యక్తులు ముద్దుపెట్టుకోవడమనే విషయం కొందరికి నచ్చడం లేదు. తెలుగు సాంప్రదాయాలను మంటగలిపే విధంగా ఉన్న ఈ టాస్క్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.  

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: కెప్టెన్సీ టాస్క్ లో గొడవ.. పూజాపై కౌశల్ అసహనం!

బిగ్ బాస్2: షోని వెంటనే ఆపేయమంటున్నారు!

బిగ్ బాస్2: గీతకు సామ్రాట్ ముద్దు.. సోషల్ మీడియాలో వైరల్!

బిగ్ బాస్2: మేం పడేస్తాంగా ప్రేమలో.. గీతామాధురి కామెంట్స్!