MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • TV
  • రామ్ చరణ్ కోసం రాసిన కథతో.. అల్లు అర్జున్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా? నిజమెంత?

రామ్ చరణ్ కోసం రాసిన కథతో.. అల్లు అర్జున్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా? నిజమెంత?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరికోసం రాసిన కథలతో.. మరో హీరో సినిమా చేయడం కామన్.. మెగా హీరోల విషయంలో కూడా అదే జరిగింది. మెగాపవన్ స్టార్ రామ్ చరణ్ కోసం దర్శకుడు ఓ కథ రాసుకుంటే.. ఆ సినిమాను అల్లు అర్జున్ చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 06 2026, 07:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒక హీరో కథ.. మరో హీరోకి హిట్
Image Credit : our own

ఒక హీరో కథ.. మరో హీరోకి హిట్

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన కథను మరొక హీరో చేయడం చాలా సాధారణమైన విషయం. ఒక కథను ఎంపిక చేసే సమయంలో హీరోలు తీసుకునే నిర్ణయాలు వారి కెరీర్‌ను ప్రభావితం చేస్తుంటాయి. టాలీవుడ్ హీరోల కెరీర్ లో ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

కొన్నిసార్లు మంచి కథలను వదులుకోవడం వల్ల కొంతమంది హీరోలు భారీ విజయాలను కోల్పోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కోసమని దర్శకుడు రాసుకున్న కథతో.. అల్లు అర్జున్ అద్భుతమైన సినిమా చేశాడన్న సంగతి మీకు తెలుసా? నిజమెంత?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రేసుగుర్రం సినిమా మిస్ అయిన చరణ్
Image Credit : our own

రేసుగుర్రం సినిమా మిస్ అయిన చరణ్

ఆ సినిమా ఏదో కాదు.. రేసుగుర్రం. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ‘రేసుగుర్రం’ సినిమా గురించి ఆసక్తికర విషయం తెగ వైరల్ అవుతోంది. . అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో అద్భుతమైన రికార్డున కూడా క్రియేట్ చేసిందీ సినిమా. అయితే ఈ సినిమా మొదట అల్లు అర్జున్ కోసం కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం రాసుకున్నాడట దర్శకుడు సురేందర్ రెడ్డి. కానీ అనుకోకుండా అది అల్లు అర్జున్ చేతికి వెళ్లింది.

Related Articles

Related image1
పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా? వారితో అనుబంధం ఎలా?
Related image2
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
35
భారీ వసూళ్లను సాధించిన అల్లు అర్జున్ సినిమా
Image Credit : Sun Nxt

భారీ వసూళ్లను సాధించిన అల్లు అర్జున్ సినిమా

ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రేసుగుర్రం’ సినిమా విడుదలైన తర్వాత భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌లో అప్పటివరకు లేని స్థాయిలో పెద్ద విజయాన్ని అందించిందని సినీ వర్గాలు పేర్కొంటాయి. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా పెద్ద సంచలనాన్ని సృష్టించింది.

45
రామ్ చరణ్ వద్దన్నాడా?
Image Credit : IMDB

రామ్ చరణ్ వద్దన్నాడా?

సినీ వర్గాల్లో వినిపిస్తున్న వివరాల ప్రకారం, దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ కథను మొదట రామ్ చరణ్‌కు వినిపించాలని భావించారట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కథ రామ్ చరణ్‌కు నచ్చలేదని తెలుస్తోంది. దాంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఇక ఓ సారి ఈ కథ అల్లు అర్జున్ వరకు చేరింది. కథ గురించి తెలుసుకున్న అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డిని పిలిపించుకుని.. పూర్తి కథ విని, వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

55
సురేందర్ రెడ్డితో రామ్ చరణ్ మూవీ..
Image Credit : X

సురేందర్ రెడ్డితో రామ్ చరణ్ మూవీ..

ఇక తర్వాత కాలంలో రామ్ చరణ్ , సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ‘ధృవ’ అనే సినిమా తెరకెక్కింది. తమిళంలో విజయవంతమైన ‘తని ఒరువన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ కథల ఎంపికలో కొత్తదనం వైపు అడుగులు వేయడం ప్రారంభించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరిగింది.

తర్వాత కాలంలో రామ్ చరణ్ చేసిన సినిమాలు ఆయనను టాలీవుడ్‌లో అగ్ర హీరోలలో ఒకరిగా నిలబెట్టాయి. ముఖ్యంగా ‘త్రిబుల్ ఆర్’ సినిమా తర్వాత ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గ్లోబల్ స్టార్‌గా పేరు సంపాదించిన రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో భారీ అంచనాల నడుమ రాబోతున్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha season 2 Review: చెత్త టాస్క్‌లతో కంపు కొడుతున్న అగ్నిపరీక్ష 2.. బిగ్ బాస్ కోసం వెళ్తే చుక్కలు చూపిస్తున్నారుగా!
Recommended image2
Sudigali Sudheer Remuneration: ప్రదీప్ ను దెబ్బకొట్టిన సుడిగాలి సుధీర్, ఒక్కొ ఎపిసోడ్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?
Recommended image3
Bigg Boss Agnipariksha: ర్యాంప్‌కి వెళ్తానంటే చెవి పగలగొట్టాడు.. బాయ్‌ఫ్రెండ్‌ కాలేజీకే జడ్జ్ గా వెళ్లి షాక్‌
Related Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా? వారితో అనుబంధం ఎలా?
Recommended image2
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved