MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Saraswathi Review: సరస్వతి మూవీ రివ్యూ.. వరలక్ష్మి శరత్‌కుమార్‌ దర్శకత్వం వహించిన సినిమా ఎలా ఉందంటే?

Saraswathi Review: సరస్వతి మూవీ రివ్యూ.. వరలక్ష్మి శరత్‌కుమార్‌ దర్శకత్వం వహించిన సినిమా ఎలా ఉందంటే?

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ దర్శకురాలిగా మారి రూపొందించిన తొలి చిత్రం `సరస్వతి`. ఈ సినిమా నేడు శుక్రవారం విడుదలైంది. మరి వరలక్ష్మి దర్శకురాలిగా మారి చేసిన ప్రయత్నం ఫలించిందా? 

5 Min read
Author : Aithagoni Raju
Published : Mar 06 2026, 06:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సరస్వతి మూవీ రివ్యూ
Image Credit : X/@varusarath5

సరస్వతి మూవీ రివ్యూ

విలక్షణ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఒకప్పుడు హీరోయిన్‌గా చేసి ఇప్పుడు బలమైన పాత్రలతో మెప్పిస్తుంది. స్ట్రాంగ్‌ లేడీ రోల్స్ కి ఆమె కేరాఫ్‌గా నిలుస్తోంది. ఈ క్రమంలో ఆమె ఇప్పుడు తనలోని కొత్త టాలెంట్‌ చూపించడానికి వచ్చింది. `సరస్వతి` అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. అంతేకాదు, దీనికి ఆమెనే నిర్మాత కావడం విశేషం. సినిమాలో ప్రధాన పాత్రలోనూ నటించింది. ప్రకాష్‌ రాజ్‌, ప్రియమణి, రావు రమేష్‌, రాధిక శరత్‌ కుమార్‌, కిశోర్‌, మురళీ శర్మ, గెటప్‌ శ్రీను, సప్తగిరి, జీవా(స్పెషల్‌ రోల్‌)లో నటించిన ఈ మూవీని దోశా డైరీస్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై పూజా శరత్‌ కుమార్‌ తో కలిసి వరలక్ష్మి నిర్మించారు. టీజర్‌, ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ మూవీ నేడు శుక్రవారం(మార్చి 6న) విడుదలైంది. మరి వరలక్ష్మి దర్శకురాలిగా సక్సెస్‌ అయ్యిందా? సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
సరస్వతి మూవీ కథ ఏంటంటే?
Image Credit : X/@varusarath5

సరస్వతి మూవీ కథ ఏంటంటే?

లక్ష్మి(వరలక్ష్మి శరత్‌ కుమార్‌) నర్స్ గా పని చేస్తుంటుంది. ఆమెకి 12ఏళ్ల కూతురు సరస్వతి ఉంటుంది. ఆగస్ట్ 15 రోజు ఆ చిన్నారి పుట్టిన రోజు. ఆ రోజు స్కూల్‌కి డ్రాప్‌ చేసి ఆసుపత్రికి వెళ్తుంది లక్ష్మి. తిరిగి సాయంత్రం వస్తే, పాప కనిపించదు, స్కూల్లో టీచర్లు, స్కూల్‌ హెడ్‌, వాచ్‌మెన్స్ ఇలా ఎవరూ సరస్వతి అనే పాప తమ స్కూల్లోనే చదువుకోవడం లేదని చెబుతారు. పోలీసులను పిలిపించినా ప్రయోజనం లేదు. ఆ రోజు రాత్రి లక్ష్మికి  సరస్వతి స్కూల్‌ నుంచి చేస్తుంది. ప్రిన్సిపల్‌ రూమ్‌లో ఉన్నానని, ప్రిన్సిపల్‌తోపాటు ఇద్దరు అంకుల్స్ బంధించారని, భయంగా ఉందని చెబుతుంది. లక్ష్మి వెళ్లగా, సరస్వతిపై అఘాయిత్యం జరుగుతుంది. ఇదంతా ఒక ఫోన్‌లో రికార్డు అవుతుంది. ఆ ఫోన్‌ని అమ్మ లక్ష్మికి ఇచ్చి చనిపోతుంది సరస్వతి. అది చూసి లక్ష్మి చలించిపోతుంది. ఈ విషయం తెలిస్తే తమ పరువుపోతుందని, అదే రాత్రి కూతురుని పూడ్చిపెడుతుంది. మార్నింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు లక్ష్మి మాటలు నమ్మరు. పాప శవం కూడా లేకపోవడంతో లక్ష్మి ఏదో కట్టుకథ చెప్పి డ్రామా ఆడుతుందని పోలీసులు, భావిస్తారు. తన పాపకి న్యాయం కోసం కోర్ట్ కి వెళ్లగా, ఏ లాయర్‌ ఆమె కేసుని తీసుకోరు. చివరికి రామానుజన్‌(ప్రకాష్‌ రాజ్‌) కేసుని తీసుకుంటాడు. కోర్ట్ లో స్కూల్‌ ప్రిన్సిపల్‌ని విచారించగా, ఆ ప్రిన్సిపల్‌ ఇతను కాదని లక్ష్మి చెబుతుంది. దీంతో రామానుజన్‌ పరువు పోతుంది. ఇలా కాదని, ఆ స్కూల్‌ ఫోటోల ఆల్బమ్‌ చూపించగా, అందులో తన కూతురుపై అఘాయిత్యానికి పాల్పడిన ప్రిన్సిపల్‌ని చూపిస్తుంది. దీంతో రామానుజన్‌ షాక్‌ అవుతాడు. ఈ కేసుని తాను తీసుకోనని చెప్పేసి వెళ్లిపోతాడు. ఈ కేసు విషయంలోనే కలెక్టర్‌ని కాల్చి చంపేస్తుంది. అనంతరం జడ్జ్ ని, పోలీస్‌ అధికారిని చంపేస్తుంది. గంట వ్యవధిలోనే ముగ్గురుని చంపి ఈ ముగ్గురే తన కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డారని చెబుతుంది. మరి ఆ ముగ్గురు ఎవరు? తన కూతురు సరస్వతిపై అఘాయిత్యం చేసింది వాళ్లేనా? తన కూతురుకి సంబంధించిన ఆధారాలు ఎందుకు దొరకలేదు? తన కూతురుని లక్ష్మి ఏం చేసింది? ఈ కేసులో ఉన్న ట్విస్ట్ ఏంటి? ఆదిత్య(జీవా)తో లక్ష్మి ఎందుకు విడిపోయింది? ఇందులో ప్రియమణి, కిశోర్‌, రాధికా శరత్‌ కుమార్‌ పాత్రలు ఏంటి? వీరికి ఈ కథకి ఉన్న సంబంధం ఏంటి? ఇందులో అసలు ట్విస్ట్ లు ఏంటనేది మిగిలిన సినిమా.

Related Articles

Related image1
Chiranjeevi తండ్రి నటించిన మూవీస్‌ ఏంటో తెలుసా? మెగాస్టార్‌కి ముందే సినిమా ఎంట్రీ.. అల్లు రామలింగయ్య వల్లే
Related image2
Balakrishna Movie: రాఘవేంద్రరావు చేసిన పాడు పని వల్ల బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన బాలయ్య సినిమా డిజాస్టర్‌
37
సరస్వతి మూవీ విశ్లేషణ
Image Credit : X/@varusarath5

సరస్వతి మూవీ విశ్లేషణ

సరస్వతి అనే చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేయడంతో తన కూతురు కోపం ఒక అమ్మ చేసే న్యాయపోరాటమే ఈ చిత్రం. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రన్‌ అవుతుంది. అదే సమయంలో మెడికల్‌గా సైకలాజికల్‌ ఫ్యాక్టర్‌ కూడా ఉంటుంది. మిస్సింగ్‌ కేసు కాస్త, సస్పెన్‌ థ్రిల్లర్‌గా మారుతుంది. ప్రారంభం నుంచే ఎంగేజింగ్‌గా రన్‌ అవుతుంది. ఏం జరుగుతుందనే ఉత్కంఠతో రన్‌ అవుతుంది. చిన్నారికి సంబంధించిన మిస్టరీ అంశాలు ఎంగేజ్‌ చేస్తాయి. నెక్ట్స్ ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంటుంది. తన కూతురుపై అఘాయిత్యం జరిగిందని లక్ష్మి, అసలు పాపనే లేదని స్కూల్‌ యాజమాన్యం చెప్పడం సస్పెన్స్ కి గురి చేస్తుంది. ఏదో జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంటుంది. సినిమా ప్రారంభంలో తన కూతురు సరస్వతితో, లక్ష్మికి ఉన్న అనుబంధం చూపించారు. ఆ తర్వాత పాప కనిపించకపోవడంతో మిస్సింగ్‌ కేసుగా మారుతుంది.  తర్వాత అఘాయిత్యం జరగడంతో  హృదయం కదిలిస్తుంది. కానీ పాపకి సంబంధించిన ఏ ఆధారాలు లేకపోవడంతో అంతా అయోమయంగా మారుతుంది. చూసే మనకే కాదు, అక్కడ జడ్జ్, లాయర్‌లు కూడా షాక్‌ అయ్యే సీన్లు, ట్విస్ట్ ఆకట్టుకుంటున్నాయి. ఇంతక లక్ష్మి ఎవరు? సరస్వతి ఎవరనేది విచారించగా, షాకింగ్‌ విషయాలు, పలు క్రేజీ విషయాలు తెలుస్తాయి. ఇవి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. సినిమా ప్రారంభం నుంచి ఎంగేజింగ్ గా వెళ్తుంది. పాప లేదనే విషయం చెప్పినప్పట్నుంచి ఎంగేజింగ్ ఫ్యాక్టర్ మిస్ అవుతుంది. దీంతో ఆ తర్వాత ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ట్విస్ట్ లు, టర్న్ లు ఉన్నా, అవి కిక్ ఇవ్వవు. సినిమా కథ కూడా రెగ్యూలర్గా ఉంటుంది. 

47
సరస్వతి మూవీ ఎలా ఉందంటే?
Image Credit : X/@varusarath5

సరస్వతి మూవీ ఎలా ఉందంటే?

అయితే ఇలాంటి మూవీస్ తెలుగలో రాలేదు. విభిన్నంగా చేసిన ప్రయత్నమని చెప్పొచ్చు. ఇంటర్వెస్ట్ ట్విస్ట్ బాగుంది. సినిమాలో ట్విస్ట్ ల, మలుపులు బాగున్నాయి. కాకపోతే కథ ముందే అర్థం కావడంతో ఏం జరుగుతుందో ఊహించవచ్చు. దీంతో ట్విస్ట్ లు తేలిపోయాయి. కథగా కాస్త కొత్తగా అనిపించినా, స్క్రీన్ ప్లే విషయంలో ఆ సస్పెన్స్ ని మెయింటేన్ చేయడం తడబాటు కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ పాత్ర ఎంట్రీతో  ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. కానీ అది రెగ్యూలర్ గానే మారిపోతుంది. సెకండాఫ్ ని కూడా ఇలాంటి ట్విస్ట్ లు, టర్న్ లతో  రన్‌ అవుతుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ బాగుంది. అయితే సినిమా కథ ని సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేకపోయారు. సస్పెన్స్ ని మెయింటేన్ చేసే విషయంలో విఫలమయ్యారు. ముగ్గురుని చంపేసే సీన్లు కూడా లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. ఆ తర్వాత ఆయా సీన్లకి సంబంధించి కోర్ట్ లో వాదనలు కూడా అంత కిక్ ఇవ్వలేదు. సాధారణంగా కోర్ట్ రూమ్ డ్రామాలో ఆ వాదనలే ఆసక్తికరంగా ఉంటాయి. కానీ ఇందులో అవి తేలిపోయాయి. ఓవరాల్ గా కథగా బాగానే ఉన్నా, దాన్ని తెరపై ఆవిష్కరించే విషయంలోనే తడబాటు కనిపిస్తుంది. మహిళలు, ఆడవారిపై అఘాయిత్యాలకు సంబంధించి కోర్ట లో వాదనలు, జడ్జ్ ఇచ్చే తీర్పు మెప్పించేలా ఉంది.

57
సరస్వతి మూవీలో నటీనటుల పర్‌ఫెర్మెన్స్
Image Credit : X/@varusarath5

సరస్వతి మూవీలో నటీనటుల పర్‌ఫెర్మెన్స్

లక్మి పాత్రలో వరలక్ష్మి చాలా బాగా చేసింది. సెటిల్డ్ గా చేసి మెప్పించింది. బాధని దిగమింగుకొని కేసు కోసం పోరాటం చేయడం, హత్యలు చేయడం వంటి సీన్లలో అదరగొట్టింది. దర్శకురాలిగా, నిర్మాతగా చేస్తూనే నటిగానూ అదరగొట్టడం విశేషం. లాయర్ రామానుజన్ గా ప్రకాష్ రాజ్ బాగా చేశారు. ఆయన పాత్ర సినిమాని నడిపిస్తుంది. ఇక జడ్జ్ గా రావు రమేష్ ఉన్నంతసేపు మెప్పించారు. పోలీస్ అధికారిగా మురళీ శర్మ బాగా చేశారు. డాక్టర్గా రాధికా, డాక్టర్ గా నాజల్, అలాగే తులసి, సప్తగిరి, గెటప్ శ్రీను తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. జీవా, ప్రియమణి, కిశోర్ పాత్రలు మెప్పిస్తాయి. సర్ప్రైజ్ చేస్తాయి. సరస్వతి పాత్రలో కనిపించిన అమ్మాయి కూడా బాగా చేసింది. ఇలా అంతా బాగానే  ఆకట్టుకున్నారు.

67
సరస్వతి మూవీ టెక్నీషియన్ల పనితీరు
Image Credit : X/@varusarath5

సరస్వతి మూవీ టెక్నీషియన్ల పనితీరు

 ఈ మూవీకి థమన్‌ సంగీతం అందించారు. బీజీఎం బాగా చేశాడు. ఏఎం ఎడ్విన్‌ సాకే కెమెరా వర్క్ చాలా బాగుంది. విజువల్స్ కనువిందుగా ఉన్నాయి. వెంకట్‌ రాజన్‌ ఎడిటర్‌ ఉన్నంతలో బాగానే చేశాడు. సినిమా నీట్‌గా నడుస్తుంది. ఇక దర్శకురాలిగా వరలక్ష్మి బాగా చేశారు. మేకింగ్‌ పరంగా క్వాలిటీ గా ఉంది. టేకింగ్‌ కూడా అదిరిపోయింది. అయితే బలమైన కథనాన్ని రాసుకుంటే బాగుండేది.  దర్శకురాలిగా తనలో టాలెంట్‌ ఉందనే విషయాన్ని మాత్రం ఆమె నిరూపించుకుంది. సినిమాని ఎంగేజింగ్‌గా, సస్పెన్స్ ని కంటిన్యూ చేసి, అదిరిపోయే ట్విస్ట్ లో రన్‌ చేస్తే బాగుండేది.

77
ఫైనల్‌గా
Image Credit : X/@varusarath5

ఫైనల్‌గా

 ఎంగేజ్‌ చేయలేకపోయిన క్రైమ్‌ థ్రిల్లర్‌ `సరస్వతి`. వరలక్ష్మి దర్శకురాలిగా మంచి కథని ఎంచుకున్నా, దాన్ని సరిగా డీల్‌ చేయలేకపోయింది. 

రేటింగ్‌: 2.25

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
Recommended image2
Gang Leader Review: చిరంజీవి కోసం కెరీర్‌ను పణంగా పెట్టిన నాగబాబు, మెగాస్టార్ రఫ్ఫాడించి 35 ఏళ్లు.. గ్యాంగ్ లీడర్ రివ్యూ
Recommended image3
The Red Bag Movie Review: ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ, మహిళా నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Chiranjeevi తండ్రి నటించిన మూవీస్‌ ఏంటో తెలుసా? మెగాస్టార్‌కి ముందే సినిమా ఎంట్రీ.. అల్లు రామలింగయ్య వల్లే
Recommended image2
Balakrishna Movie: రాఘవేంద్రరావు చేసిన పాడు పని వల్ల బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన బాలయ్య సినిమా డిజాస్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved