బిగ్ బాస్ సీజన్ 2 పూర్తికావడానికి మరికొద్దిరోజుల్లో మాత్రం మిగిలి ఉండడంతో హౌస్ మేట్స్ లో పోటీ ఎక్కువైంది. ఈ షో అనౌన్స్ చేసినప్పుడే ఇంకొంచెం మసాలా అని అన్నారు. దానికి తగ్గట్లే హౌస్ లో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదట్లో తనీష్-సునైనా, ఆ తరువాత సామ్రాట్-తేజస్వి, తనీష్-నందిని ల రొమాంటిక్ ట్రాక్ లు నడిచాయి. ఇప్పుడు నందిని, సునైనా, తేజస్వి ఎలిమినేట్ కావడంతో ఆ బాధ్యతల్ని సామ్రాట్-గీతామాధురి తీసుకున్నట్లుగా ఉన్నారు.

ఇటీవల జరిగిన ఎపిసోడ్స్ లో వీరి బంధం పెనవేసుకుందనే చెప్పాలి. చూపుల యుద్ధంతో మొదలైన వీరి ట్రాక్ ముద్దుల వరకు వచ్చేసింది. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో సామ్రాట్, గీతాని ముద్దు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి రోల్ రైడా.. గీతామాధురికి ముద్దు పెట్టాలనేది టాస్క్. రోల్ కి ఈజీ అవ్వడం కోసం సామ్రాట్ ముందుగా గీతకు ముద్దుపెట్టాడు. దీంతో సోషల్ మీడియాలో గీతామాధురిపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.

బిగ్ బాస్ షో ఆరంభంలో ఎంతో మెచ్యూర్డ్ గా వ్యవహరించిన గీతా రాను రాను ఈ విధంగా ప్రవర్తించడం ప్రేక్షకులకు రుచించడం లేదు. టాస్క్ లో భాగమే అయినప్పటికీ.. సామ్రాట్, తనీష్, రోల్ లతో మాట్లాడుతూనే నందుతో మాట్లాడుతున్నట్లు ఉందని తన భర్తని వారితో పోల్చడం ఇప్పుడు నెటిజన్లకు అస్త్రంగా మారింది.